- Home
- Sports
- Cricket
- వన్డే వరల్డ్ కప్ 2023 కోసం కేంద్రానికి రూ.963 కోట్ల ట్యాక్స్ కడుతున్న బీసీసీఐ... త్వరలో షెడ్యూల్...
వన్డే వరల్డ్ కప్ 2023 కోసం కేంద్రానికి రూ.963 కోట్ల ట్యాక్స్ కడుతున్న బీసీసీఐ... త్వరలో షెడ్యూల్...
2011 వన్డే వరల్డ్ కప్ తర్వాత 12 ఏళ్లకు మళ్లీ వన్డే వరల్డ్ కప్‌కి ఆతిథ్యం ఇస్తోంది టీమిండియా. కరోనా కేసుల కారణంగా ఇండియాలో జరగాల్సిన 2021 టీ20 వరల్డ్ కప్ కూడా తటస్థ వేదిక యూఏఈలో నిర్వహించాల్సి వచ్చింది. దీంతో ఈసారి టీమిండయాపై భారీ భారీ అంచనాలు పెరిగిపోయాయి...
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఇప్పటికే ఆతిథ్య టీమిండియాతో పాటు ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు నేరుగా ఐసీసీ వన్డే క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ లీగ్‌కి అర్హత సాధించాయి. శ్రీలంకతో పాటు వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఐర్లాండ్, జింబాబ్వే, నెదర్లాండ్స్ వంటి జట్లు క్వాలిఫైయర్స్ రౌండ్‌లో పోటీపడబోతున్నాయి..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీని అక్టోబర్ 5 నుంచి ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అక్టోబర్ 5న మొదలయ్యే టోర్నీ, నవంబర్ 19న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగుస్తుంది. ఇండియాలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం మొతేరాలో ఫైనల్ మ్యాచ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి...
భారత్‌లోని అహ్మదాబాద్, ముంబై, కోల్‌కత్తా, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ధర్మశాల, గౌహతి, హైదరాబాద్, లక్నో, ఇండోర్, రాజ్‌కోట్ నగరాల్లో వన్డే వరల్డ్ కప్ 2023 మ్యాచులు నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తోంది బీసీసీఐ...
Image credit: PTI
ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన తర్వాత వన్డే వరల్డ్ కప్ 2023 పూర్తి షెడ్యూల్‌తో పాటు వేదికలపై క్లారిటీ వస్తుంది. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కోసం దాదాపు వెయ్యి కోట్ల రూపాయలను ట్యాక్స్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లించబోతోంది బీసీసీఐ...
Image credit: PTI
ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ మండలి) ద్వారా వన్డే వరల్డ్ కప్ 2023 మ్యాచుల నిర్వహణ కోసం రూ.963 కోట్లను కేంద్ర ఖజానాకి ట్యాక్సుల రూపంలో చెల్లించనుంది భారత క్రికెట్ నియంత్రణ బోర్డు. ఐపీఎల్ ద్వారా దాదాపు లక్ష కోట్ల రూపాయల ఆదాయం బీసీసీఐ ఖజానాలో చేరింది...
Image credit: PTI
అయితే ఆశ్చర్యకరంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చే ఆదాయానికి బీసీసీఐ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. దేశంలో క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన లీగ్ కావడంతో ఇన్‌కం ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబునల్ (ITAT), ఐపీఎల్‌కి ట్యాక్స్ మినహాయింపు ఇచ్చింది..
ఐపీఎల్ ద్వారా ప్లేయర్లు తీసుకునే ఆదాయంలో మాత్రం ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకి వేలంలో రూ.18.5 కోట్ల భారీ మొత్తం దక్కించుకున్న ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కుర్రాన్, భారత ప్రభుత్వానికి 20 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. భారత ప్లేయర్లు 10 శాతం ట్యాక్స్ రూపంలో చెల్లించాలి..