- Home
- Sports
- Cricket
- క్రమశిక్షణ మీరితే ‘శిక్ష’లు తప్పవు.. ఐపీఎల్‌లో నిబంధనలను ఉల్లంఘించిన క్రికెటర్లకు ప్లేస్ కష్టమే!
క్రమశిక్షణ మీరితే ‘శిక్ష’లు తప్పవు.. ఐపీఎల్‌లో నిబంధనలను ఉల్లంఘించిన క్రికెటర్లకు ప్లేస్ కష్టమే!
BCCI:ఆటగాళ్ల క్రమశిక్షణ విషయంలో బీసీసీఐ కాస్త కటువుగానే వ్యవహరిస్తున్నది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్- 2023లో నిబంధనలను ఉల్లంఘించిన పలువురిపై చర్యలు తప్పవని హెచ్చరించింది.

దేశవాళీ, ఐపీఎల్ లో ఆటగాళ్ల ప్రదర్శనతో పాటు ఆన్ ది ఫీల్డ్, ఆఫ్ ది ఫీల్డ్ లో వ్యవహరిస్తున్న తీరుపై బీసీసీఐ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇటీవలే ముంబై బ్యాటర్, దేశవాళీలో టన్నుల కొద్దీ పరుగులు చేస్తున్న సర్ఫరాజ్ ఖాన్.. ముంబై - ఢిల్లీ రంజీ మ్యాచ్ లో సెంచరీ చేశాక మాజీ చీఫ్ సెలక్టర్ ఛేతన్ శర్మ వైపునకు వేలు చూపిస్తూ తొడ కొట్టడం బీసీసీఐకి ఆగ్రహం తెప్పించింది.
ఈ కారణంతోనే బీసీసీఐ.. అతడిని త్వరలో జరుగబోయే వెస్టిండీస్ సిరీస్ లో ఎంపిక చేయలేదని బోర్డు వర్గాల ప్రతినిధులు చెప్పారు. ఇక తాజాగా బీసీసీఐ.. ఐపీఎల్ - 2023లో క్రమశిక్షణ తప్పిన ఆటగాళ్లపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమైందట.
Image credit: PTI
క్రిక్ బజ్ లో వచ్చిన నివేదిక ప్రకారం.. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ - 16 లో పలువురు వెస్ట్, నార్త్ జోన్ క్రికెటర్లు క్రమశిక్షణా చర్యలను ఉల్లంఘించినట్టు తెలుస్తున్నది. ఆన్ ది ఫీల్డ్ లోనే గాక ఆఫ్ ది ఫీల్డ్ లో కూడా వారి వ్యవహార శైలిపై బీసీసీఐ ఓ కన్నేసి ఉంచింది. పలుమార్లు నిబంధనలను అతిక్రమించిన ఆటగాళ్లపై భారీ చర్యలు తప్పవని బోర్డు వర్గాలు చెప్పినట్టు సమాచారం.
Image credit: PTI
వెస్ట్, నార్త్ జోన్ లో ఉన్న పలు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు కూడా తమ ఆటగాళ్ల చర్యలను యాజమన్యం దృష్టికి తీసుకెళ్లిన బీసీసీఐ.. తీరు మార్చుకోకుంటే భారీ చర్యలకు దిగుతామని వారికి హెచ్చరించిందట. వెస్టిండీస్ తో టీ20 సిరీస్ లో చోటు కోసం చూస్తున్న వారు కూడా ఈ నిబంధనలను ఉల్లంఘించిన బ్యాచ్ లో ఉన్నారని తెలుస్తున్నది. మరి వీళ్లకు బీసీసీఐ షాకులిస్తుందా..? అన్నది త్వరలోనే తేలనుంది.
బీసీసీఐ వర్గాల సమాచారం మేరకు దాదాపు నలుగురు క్రికెటర్లు క్రమశిక్షణా చర్యలకు అతిక్రమించి ప్రవర్తించినట్టు తెలుస్తున్నది. అయితే వీళ్లు ఎవరు..? ఏ టీమ్ ల నుంచి ప్రాతినిథ్యం వహించారన్నది మాత్రం స్పష్టత లేదు. క్రికెటర్లకు ఆటతో పాటు డిసిప్లీన్ గా ఉండటం, అనైతిక చర్యలకు పాల్పడకుండా ఉండటం ముఖ్యమని సదరు క్రికెటర్లకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు క్లాస్ పీకినట్టు తెలుస్తున్నది.
Yashasvi Jaiswal
అయితే దేశవాళీతో పాటు ఐపీఎల్ - 16 లోనూ మెరిసి వెస్టిండీస్ తో టీ20 టీమ్ లో చోటును ఆశిస్తున్న వెస్ట్, నార్త్ జోన్ ప్లేయర్లలో ముఖ్యంగా జితేశ్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, అవేశ్ ఖాన్, మోహిత్ శర్మ, వరుణ్ చక్రవర్తిలు ఉన్నారు. మరి వీరిలో క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘించింది ఎవరు..? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే..!