- Home
- Sports
- Cricket
- దాదాని అనే ధైర్యం ఎవ్వరికీ లేదు... గంగూలీ పనీతరు బాలేదని ఎవ్వరూ చెప్పలేదంటున్న బీసీసీఐ...
దాదాని అనే ధైర్యం ఎవ్వరికీ లేదు... గంగూలీ పనీతరు బాలేదని ఎవ్వరూ చెప్పలేదంటున్న బీసీసీఐ...
భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని అధ్యక్ష పదవి నుంచి తప్పించింది భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ). దాదాపు మూడేళ్ల పాటు బీసీసీఐ బాస్‌గా ఉన్న గంగూలీ పనితీరు ఏ మాత్రం బాగోలేదని వార్షిక సమావేశంలో విమర్శలు వచ్చాయని, అందుకే దాదాని కొనసాగించేందుకు బోర్డు సభ్యులు సుముఖత వ్యక్తం చేయలేదని వార్తలు వినిపించాయి. అయితే వీటిల్లో ఏ మాత్రం నిజం లేదంటున్నాడు బీసీసీఐ ట్రెజరర్, ఐపీఎల్ మాజీ ఛైర్మెన్ అరుణ్ దుమాల్...

Sourav Ganguly
కరోనా లాక్‌డౌన్ టైంలో ఐపీఎల్ 2020 సీజన్‌ని విజయవంతంగా నడిపించి, కోవిడ్ కారణంగా 2021 సీజన్‌కి బ్రేక్ పడినా రెండు ఫేజ్‌లుగా పూర్తి చేశాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. 2022లో కొత్త ఫ్రాంఛైజీలను తీసుకొచ్చి, 2023-27 ఐపీఎల్ ప్రసార హక్కుల విక్రయం ద్వారా వేల కోట్ల ఆదాయాన్ని బీసీసీఐ ఖజానాలో నింపాడు గంగూలీ...
Sourav Ganguly
‘స్వాతంత్య్రానంతరం భారత క్రికెట్ బోర్డుకి ప్రెసిడెంట్‌కి ఎవ్వరూ మూడేళ్లకంటే ఎక్కువ కాలం పనిచేయలేదు. మీడియాలో వస్తున్న వార్తలన్నీ పచ్చి అబద్ధాలు, అవాస్తవాలు, ఉట్టి ఊహాగానాలు మాత్రమే. బీసీసీఐలో కొందరు సభ్యులు, దాదాకి వ్యతిరేకంగా మాట్లాడారని అంటున్నారు, అవన్నీ పుకార్లే...
సౌరవ్ గంగూలీ పనితీరు పట్ల అందరూ సంతోషం వ్యక్తం చేశారు, సంతృప్తి చెందారు. ఎవ్వరూ దాదాకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. కరోనా కష్టకాలంలోనూ క్రికెట్‌కి బ్రేక్ పడకుండా బీసీసీఐని మూడేళ్ల పాటు నడిపాడు సౌరవ్ గంగూలీ. ఆయన సక్సెస్‌కి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది..
భారత కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ కెరీర్ చాలా గొప్పగా సాగింది.. భారత జట్టుకే కాదు క్రికెట్ ప్రపంచంలోనే ఆయన ఓ గొప్ప లీడర్. అడ్మినిస్ట్రేటర్‌గా కూడా జట్టును మొత్తాన్ని ఒకే తాటిపై నడిపించారు. రోజర్ బిన్నీ నామినేషన్ వేసిన సమయంలో కూడా గంగూలీ అక్కడే ఉన్నాడు...
దాదాతో అన్ని విషయాలు మాట్లాడాం. ఆయనకి ఐపీఎల్ ఛైర్మెన్ పదవి ఇస్తామని ఆఫర్ కూడా ఇచ్చాం. కానీ ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించాడు. రోజర్ బిన్నీకి ఇప్పటిదాకా అవకాశం రాలేదు. 67 ఏళ్ల వయసులో బిన్నీకి అవకాశం ఇవ్వడం సమజసమే కదా...
Roger Binny
రోజర్ బిన్నీ వరల్డ్ కప్ విన్నర్ కూడా. ఒకవేళ దాదా, ఐపీఎల్ ఛైర్మెన్ పదవిని అంగీకరించి ఉంటే నేను బయటికి వెళ్లేవాడిని, అయినా గంగూలీ లాంటి వ్యక్తి కోసం సంతోషంగా నా పదవిని త్యాగం చేసేవాడిని...’ అంటూ చెప్పుకొచ్చాడు బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ దుమాల్..