వెంటనే ఆయన్ని ఆస్ట్రేలియాకి పంపించండి... భారతజట్టును కాపాడే సత్తా అతనికి మాత్రమే ఉంది...
First Published Dec 20, 2020, 12:04 PM IST
భారత క్రికెట్ అభిమాని కలలో కూడా ఊహించని ఘోరమైన ప్రదర్శనను కనబర్చింది టీమిండియా. మొదటి టెస్టు మూడో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే పరిమితమై, ఈ దశాబ్దంలోనే చెత్త రికార్డు నమోదుచేసింది. ‘ఈతరం ద్రావిడ్’గా పేరొందిన పూజారా నుంచి టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్ అజింకా రహానే, హనుమ విహారి దాకా 11 మంది బ్యాట్స్‌మెన్ అందరూ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు.

ఆస్ట్రేలియా పిచ్‌లపై పెద్దగా అనుభవం లేని పృథ్వీషా, మయాంక్ అగర్వాల్ తొందరగా అవుట్ అవ్వడం పెద్దగా విశేషమేమీ కాదు, కానీ ‘మోడ్రన్ వాల్’గా గుర్తింపు తెచ్చుకున్న పూజారా డకౌట్ కావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఆస్ట్రేలియా పిచ్‌లపై పరుగుల వరద పారించిన విరాట్ కోహ్లీని 4 పరుగులకే పెవిలియన్ చేర్చిన ఆస్ట్రేలియా... వైస్ కెప్టెన్ అజింకా రహానేను కూడా డకౌట్ చేసింది...
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?