నటరాజన్ రెండు నెలలు ఆగాడు... కోహ్లీ రెండు వారాలు ఆగలేడా... సునీల్ గవాస్కర్ ఫైర్...

First Published Dec 24, 2020, 10:41 AM IST

భారత సారథి విరాట్ కోహ్లీ పెటర్నిటీ లీవ్ మీద స్వదేశానికి రావడంపై కొందరు మాజీలు అతని నిర్ణయాన్ని ప్రశంసిస్తుంటే, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. జీవితంలో మధురమైన క్షణాలను అస్వాదించాలని కోహ్లీ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి... విరాట్‌కి సపోర్టుగా నిలిస్తే, మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, కపిల్‌దేవ్... కోహ్లీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.

ఐపీఎల్ 2020 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, గ్రూప్ స్టేజ్‌లో ముంబై ఇండియన్స్‌తో ఆడిన చివరి మ్యాచ్‌ సమయంలో ఓ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది నటరాజన్ భార్య...

అయితే ఐపీఎల్ కోసం యూఏఈలో ఉన్న నటరాజన్, ఆ తర్వాత అనుకోకుండా ఆస్ట్రేలియా టూర్‌కి ఎంపిక కావడంతో అటు నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లాడు...

మూడో వన్డేలో వన్డే ఆరంగ్రేటం చేసిన నటరాజన్, టీ20ల్లోనూ సత్తా చాటి... టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు...

అయితే టెస్టు సిరీస్‌కి నెట్ బౌలర్‌గా ఎంపికైన నటరాజన్, టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత స్వదేశానికి రాబోతున్నాడు...

అంటే బిడ్డ పుట్టిన మూడు నెలల తర్వాత కూతుర్ని చూసుకోబోతున్నాడు యార్కర్ కింగ్ నటరాజన్...  అలాంటిది విరాట్ కోహ్లీని మాత్రం ముందుగానే పంపడం ఏమిటని నిలదీస్తున్నాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.

ఒకే టీమ్‌లో ఉన్న ఇద్దరు ప్లేయర్ల విషయంలో ఇంత పక్షపాతం ఎందుకని బీసీసీఐ వైఖరిని ప్రశించాడు సునీల్ గవాస్కర్...

‘భారత జట్టులోకి నటరాజన్ కొత్తగా వచ్చాడు. రాకరాక వచ్చిన ఛాన్స్‌ను వదులుకోవడం ఇష్టం లేక అతను బీసీసీఐ వైఖరిపై నోరు మెదపడం లేదు...

యార్కర్లతో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడు నటరాజన్. హార్ధిక్ పాండ్యా తనకి వచ్చిన ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డునే నటరాజన్‌కి ఇచ్చాడనే నట్టూ టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు...

నటరాజన్ ఐపీఎల్ సమయంలో తండ్రి అయ్యాడు. కానీ ఇంకా బిడ్డను చూసుకునే అవకాశం దక్కలేదు. గాయపడిన వరుణ్ చక్రవర్తి స్థానంలో జట్టులోకి వచ్చిన నటరాజన్, యూఏఈ నుంచి నేరుగా ఆస్ట్రేలియా వెళ్లాడు...

నటరాజన్ టెస్టు జట్టులో లేడు. అయినా నెట్ బౌలర్‌గా అతన్ని అక్కడే ఉంచుకుంది. మరోవైపు ఇంకా బిడ్డకి జన్మనివ్వకముందే విరాట్ కోహ్లీ, తన భార్యకి తోడుగా ఉండేందుకు స్వదేశానికి వచ్చేశాడు...

బిడ్డ పుట్టి రెండు నెలలైనా కళ్లారా చూసుకునే అవకాశం నటరాజన్‌కి ఇవ్వలేదు. నటరాజన్‌కి ఓ రూల్, కెప్టెన్‌కి ఓ రూల్ ఉంటుందా... ఒక్కో ప్లేయర్‌కి ఒక్కో రూల్ ఉండడం ఎంత వరకూ కరెక్ట్...

ఇండియన్ క్రికెట్‌లో ఇంతకంటే మెరుగ్గా రూల్స్ ఎలా ఉంటాయి... బీసీసీఐ ద్వంద్వ విధానాలను అవలంభిస్తోంది... ’ అంటూ భారత క్రికెట్ బోర్డు తీరుపై ఫైర్ అయ్యాడు సునీల్ గవాస్కర్.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?