IPL 2021 మెగా వేలం వాయిదా... ఈసారికి మినీ వేలంతోనే... బీసీసీఐ ఆలోచన మారిందా?
First Published Dec 23, 2020, 11:38 AM IST
ఐపీఎల్ 2020 సీజన్ సూపర్ డూపర్ హిట్టైన తర్వాత 2021 సీజన్‌లో మార్పులు చేయాలని నిర్ణయించుకుంది బీసీసీఐ. వచ్చే ఏడాది సమ్మర్‌లో జరిగే ఐపీఎల్‌లో అదనంగా రెండు జట్లు చేర్చాలని, వీటికోసం త్వరలో మెగా వేలం నిర్వహించబోతున్నారని టాక్ కూడా వినిపించింది. అయితే ఈసారికి ఈ ప్రయోగాలకు ‘కామా’ పెట్టాలని భావిస్తోందట భారత క్రికెట్ బోర్డు.

2021 ఐపీఎల్ సీజన్‌లో 10 జట్లు ఆడతాయని ప్రచారం జరిగింది. కొత్తగా చేరే జట్లలో ఓ జట్టు అహ్మదాబాద్ పేరుతో ఉంటుందని కూడా టాక్ వినిపించింది...

అయితే కరోనా కారణంగా 2020 సీజన్ ఆలస్యంగా జరగడంతో 2021 సీజన్‌కి పెద్దగా సమయం లేకుండా పోయింది. అదీకాకుండా స్టేడియాల్లోకి జనాలను అనుమతిస్తారా? లేదా? అనే విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?