- Home
- Sports
- Cricket
- బీసీసీఐ అధ్యక్ష పదవికి సౌరవ్ గంగూలీ రాజీనామా! సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఫేక్ న్యూస్...
బీసీసీఐ అధ్యక్ష పదవికి సౌరవ్ గంగూలీ రాజీనామా! సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఫేక్ న్యూస్...
టీమిండియా చరిత్రలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్లలో ఒకడైన సౌరవ్ గంగూలీ, 2019లో బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నాడు. టెంపరరీ ప్రెసిడెంట్‌గా ఆరు నెలల కాలానికి ప్రెసిడెంట్ కూర్చీ ఎక్కిన గంగూలీ, రెండున్నరేళ్లుగా ఆ పొజిషన్‌ని వదలడం లేదు. అయితే గంగూలీ త్వరలో బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేయబోతున్నాడంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది...

బీసీసీఐ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కరోనా వైరస్, లాక్‌డౌన్ వంటి ప్రతికూల పరిస్థితులను అధిగమించి... ఐపీఎల్ 2020 నిర్వహించి సూపర్ సక్సెస్ సాధించాడు సౌరవ్ గంగూలీ...
ఐపీఎల్ 2021 సీజన్ తర్వాత 10 ఫ్రాంఛైజీలుగా ఐపీఎల్ 2022ని నిర్వహించిన దాదా అండ్ టీమ్, ప్రసార హక్కుల విక్రయం ద్వారా బీసీసీఐ హుండీకి రూ.48 వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చి పెట్టారు.. అయితే గంగూలీ, బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో విరాట్ కోహ్లీని వన్డే ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయం సంచలనం క్రియేట్ చేసింది...
బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీకి, విరాట్ కోహ్లీకి మధ్య ఉన్న విభేదాల కారణంగా అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించారని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో కోహ్లీ ఫ్యాన్స్, గంగూలీపై పీకల దాకా కోపంతో ఉన్నారు...
ఐసీసీ ఛైర్మెన్‌గా ఉన్న గ్రెగ్ బార్‌క్లే, త్వరలో ఆ పదవి నుంచి తప్పుకోబోతుండడంతో బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, ఆ పొజిషన్‌ని చేపట్టబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. గంగూలీ, ఐసీసీ ఛైర్మెన్‌గా బాధ్యతలు తీసుకోవాలంటే బీసీసీఐ ప్రెసిడెంట్‌గా తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది...
దీన్ని ఆధారంగా చేసుకుని సౌరవ్ గంగూలీ వ్యక్తిగత కారణాలతో బీసీసీఐ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పుకుంటున్నారని, బీసీసీఐ సెక్రటరీగా ఉన్న జై షా... అధ్యక్ష బాధ్యతలు తీసుకోబోతున్నట్టు ఓ ఫేక్ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది...
Sourav Ganguly
అయితే త్వరలో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఉన్నందున ఇప్పట్లో బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకునే ఆలోచనల్లో సౌరవ్ గంగూలీ లేడని సమాచారం. ఇవన్నీ దాదా అంటే గిట్టని వాళ్లు చేస్తున్న పని అంటూ ఈ వార్తలను తిప్పికొడుతున్నాడు గంగూలీ అభిమానులు..