ఆ మ్యాచ్ తర్వాత కోహ్లీని కాదని అజింకా రహానేకి సౌరవ్ గంగూలీ కాల్... ఏం చెప్పాడంటే...
ఆడిలైడ్ టెస్టు ఓటమి టీమిండియాకి ఓ పీడకలలా మిగిలిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం తెచ్చుకున్న తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు 36 పరుగులకే ఆలౌట్ కావడం క్రికెట్ ఫ్యాన్స్ అందరినీ షాక్‌కి గురి చేసింది. ఆ షాక్ నుంచి త్వరగానే బయటపడింది టీమిండియా...
ఆడిలైడ్ రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు 36 పరుగులకే ఆలౌట్ అయిన తర్వాత బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ నుంచి భారత తాత్కాలిక సారథి అజింకా రహానేకి ఫోన్ వచ్చిందట... ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించాడు రహానే...
ఆడిలైడ్‌లో 36 పరుగులకే ఆలౌట్ కావడం ఓ కోలుకోలేని షాక్ అనుకుంటే, ఆ టెస్టులో హాఫ్ సెంచరీతో రాణించిన భారత సారథి విరాట్ కోహ్లీ పెటర్నిటీ లీవ్ ద్వారా స్వదేశానికి బయలుదేరడానికి రెఢీ అయ్యాడు... అలాంటి సమయంలో గంగూలీ నింపిన స్ఫూర్తి ఎంతగానో ఉపయోగపడిందని చెప్పాడు రహానే..
‘ఆడిలైడ్ టెస్టు తర్వాత సౌరవ్ గంగూలీ నాకు ఫోన్ చేశాడు... ఆడిలైడ్ ఓటమి తర్వాత చాలాసేపు నాతో మాట్లాడారు... ఆ ఓటమిని మరిచిపోయి... ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో రెండో టెస్టు కోసం బరిలో దిగాలని చెప్పారు...
ఓ కెప్టెన్‌గా ప్రతీ ప్లేయర్‌నూ, జట్టునూ నమ్ముతూ విజయం కోసం ఆఖరి నిమిషం దాకా పోరాడాలని నాలో ఉత్సాహం నింపారు... ఆయన చెప్పిన మాటలు నాలో ఎంతో స్ఫూర్తినింపాయి... ’ అని చెప్పుకొచ్చాడు రహానే...
తాను సారథ్యం వహించిన మూడు టెస్టుల్లోనూ యువఆటగాళ్లు అద్భుతంగా రాణించారని, వారి సక్సెస్ వెనకాల భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ఉన్నారని చెప్పుకొచ్చాడు రహానే...
‘ఐపీఎల్ యువ క్రికెటర్లకు ఎంతో ఉపయోగపడుతోంది. దేశవాళీ క్రికెట్ నుంచి నేరుగా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టినప్పుడు ఏ ప్లేయర్ అయినా కాస్త భయానికి, ఒత్తిడికి లోనవుతాడు...
కానీ ఐపీఎల్ కారణంగా విదేశీ ప్లేయర్లతో ఆడిన అనుభవం యంగ్ ప్లేయర్లకు వస్తోంది. దీంతో ఎంట్రీ మ్యాచుల్లోనే ఏ మాత్రం భయం లేకుండా రాణిస్తున్నారు కుర్రాళ్లు...
యువ ఆటగాళ్లలోని ప్రతిభను వెలికి తీసి, వారిని మరింత మెరుగ్గా రాణించేలా తీర్చి దిద్దుతున్నారు రాహుల్ ద్రావిడ్... సుందర్, నట్టూ, శార్దూల్, సైనీ, పంత్, గిల్... వీరి విజయంలో రాహుల్ ద్రావిడ్‌కి కూడా పాత్ర ఉంది...’ అంటూ చెప్పుకొచ్చాడు రహానే.
భారత సారథి విరాట్ కోహ్లీ తనకు మంచి స్నేహితుడని చెప్పిన రహానే, కెప్టెన్సీ గురించి అతనితో పోటీ పడడం లేదని స్పష్టం చేశాడు...