- Home
- Sports
- Cricket
- విరాట్ కోహ్లీ ప్రెస్ కాన్ఫిరెన్స్‌పై బీసీసీఐ సీరియస్... టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత చర్యలకు...
విరాట్ కోహ్లీ ప్రెస్ కాన్ఫిరెన్స్‌పై బీసీసీఐ సీరియస్... టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత చర్యలకు...
సౌతాఫ్రికా పర్యటనకు ముందు జరుగుతున్న పరిణామాలు, సగటు భారత క్రికెట్ అభిమానిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఎన్నాడూ లేనట్టుగా భారత క్రికెట్‌లో చీలికలు వచ్చినట్టు తెలుస్తోంది...

సౌతాఫ్రికా టూర్‌కి వెళ్లేముందు ఇచ్చిన ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో తనను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్టుగా గంటన్నర ముందే చెప్పారని, దానికి తాను సరే అన్నానని కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...
అలాగే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోకూడదని స్వయంగా తాను కోహ్లీని అడిగినట్టు చెప్పగా... విరాట్ మాత్రం అదేమీలేదని తేల్చేశాడు...
విరాట్ కోహ్లీ అబద్ధం చెప్పాడా? లేక బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో ఉన్న సౌరవ్ గంగూలీ అబద్ధం చెప్పాడా? అనేది క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ అయిపోయింది...
విరాట్ కోహ్లీ ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో చేసిన వ్యాఖ్యలపై బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ స్పందించడానికి ఇష్టపడలేదు... ‘అవన్నీ బీసీసీఐ చూసుకుంటుందని’ కామెంట్ చేశాడు...
అయితే విరాట్ కోహ్లీ ఇచ్చిన ప్రెస్ కాన్ఫిరెన్స్‌పై బీసీసీఐ సీరియస్‌గా ఉందని, సౌతాఫ్రికా టూర్ త్వరలో ప్రారంభం కాబోతున్నందుకు అతనిపై చర్యలు తీసుకోకుండా ఆగిందని సమాచారం...
బీసీసీఐకి, భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి వ్యతిరేకంగా కామెంట్లు చేసిన విరాట్ కోహ్లీని క్రమశిక్షణారాహిత్య చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోందట భారత క్రికెట్ నియంత్రణ బోర్డు...
‘ఓ సున్నిత విషయాన్ని ఎలా డీల్ చేయాలో సౌరవ్ గంగూలీ కంటే గొప్పగా ఎవ్వరికీ బాగా తెలీదు. అలాంటి విషయాలను డీల్ చేయడంలో ఆయనే సరైన ఎక్స్‌పర్ట్...
బీసీసీఐపై విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు మాత్రం సరైనవి కావు. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ఎంత ముఖ్యమో బీసీసీఐకి బాగా తెలుసు. అందుకే ఈ సిరీస్‌కి ముందు ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ఇష్టపడడం లేదు...
ఇప్పుడు విరాట్ కోహ్లీపై చర్యలు తీసుకుంటే అది టీమ్‌పై ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే సమయం కోసం వేచి చూస్తున్నాం..’ అంటూ ఓ బీసీసీఐ అధికారి కామెంట్ చేశాడు...
బీసీసీఐ నుంచి సెంట్రల్ కాంట్రాక్ట్ పొందుతున్న ఏ ప్లేయర్ కూడా బోర్డు గురించి కానీ, బోర్డు సభ్యుల గురించి కానీ విరుద్ధంగా కామెంట్లు చేయకూడదు. బోర్డు ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యవహరించకూడదు..
అలాగే బోర్డు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో పాల్గొంటూ బీసీసీఐ వ్యవహారశైలిని ప్రశ్నించడం కూడా బోర్డు పెద్దలను కించపరిచినట్టైంది. మరి బీసీసీఐ, విరాట్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటోందో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే...