- Home
- Sports
- Cricket
- ఎందుకు ఓడిపోయారో చెప్పండి? విచారణ కమిటీ ముందుకి రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్, మాజీ సెలక్టర్లు...
ఎందుకు ఓడిపోయారో చెప్పండి? విచారణ కమిటీ ముందుకి రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్, మాజీ సెలక్టర్లు...
ఐపీఎల్‌లో ఐదు సార్లు టైటిల్ గెలిచిన మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా రికార్డులు క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ. ఐపీఎల్ రికార్డు కారణంగానే విరాట్ కోహ్లీని తప్పించి రోహిత్‌కి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది బీసీసీఐ. అయితే ఆ అంచనాలను రోహిత్ శర్మ అందుకోలేకపోయాడు...

రోహిత్ శర్మ కెప్టెన్సీలో స్వదేశంలో జరిగిన ద్వైపాక్షిక సిరీసుల్లో వరుస విజయాలు అందుకుంది టీమిండియా. అయితే ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో మాత్రం నిరాశే ఎదురైంది. ఆసియా కప్‌లో సూపర్ 4 రౌండ్ నుంచే ఇంటిదారి పట్టిన భారత జట్టు, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో సెమీస్‌లో ఓడింది..
ముఖ్యంగా సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో పాక్‌తో మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన టీమిండియా, మరోసారి ఇంగ్లాండ్‌పై అదే చెత్త రికార్డును రిపీట్ చేసింది. ఈ ఓటమిపై బీసీసీఐ మేనేజ్‌మెంట్ సీరియస్‌గా ఉంది...
Image credit: PTI
ఓటమికి కారణాలు చెప్పాల్సిందిగా బీసీసీఐ మాజీ సెలక్షన్ కమిటీ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మలకు నోటీసులు జారీ చేసిందట బీసీసీఐ. వీరంతా బీసీసీఐ బోర్డు మీటింగ్‌కి హాజరయ్యి, కారణాలను వివరించాల్సి ఉంటుంది...
2022 ఏడాదిలో ఏకంగా ఏడుగురు కెప్టెన్లను మార్చింది బీసీసీఐ. రోహిత్ శర్మ పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాక విదేశాల్లో ఒక్క టెస్టు కూడా ఆడలేదు. దీంతో రోహిత్ పూర్తి స్థాయి కెప్టెన్‌గా కొనసాగగలడా? లేదా? అనే విషయంపై ఓ నిర్ణయం తీసుకోబోతున్నారు.
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసిన యజ్వేంద్ర చాహాల్‌ని ఒక్క మ్యాచ్ కూడా ఆడించకపోవడానికి కారణాలతో పాటు రాహుల్ త్రిపాఠి, సంజూ శాంసన్ వంటి ప్లేయర్లను రిజర్వు బెంచ్‌కే పరిమితం చేయడానికి కారణాలను కూడా ఈ రివ్యూ మీటింగ్‌లో వివరించాలని కోరారు అధికారులు...
Image credit: PTI
టీమిండియా ఐసీసీ టైటిల్స్ గెలవడానికి తీసుకోవాల్సిన చర్యలు, చేయాల్సిన మార్పుల గురించి ఈ మీటింగ్‌లో చర్చించబోతున్నట్టు సమాచారం... ఎన్‌సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఈ రివ్యూ మీటింగ్‌కి హాజరు కాబోతున్నాడు...
Image credit: Getty
క్రికెట్ అడ్వైసరీ కమిటీ సభ్యులు అశోక్ మల్హోత్రా, జతిన్ పరన్‌పే, సులక్షణ నాయిక్ ఇదే మీటింగ్‌లో కొత్త సెలక్షన్ బోర్డును ప్రకటించబోతున్నారు. వెంకటేశ్ ప్రసాద్, నయన్ మోంగియాతో పాటు మాజీ బీసీసీఐ ఛీఫ్ చేతన్ శర్మ, బోర్డు సభ్యుడు హర్విందర్ సింగ్ కూడా తిరిగి సెలక్షన్ ప్యానెల్ పోస్టులకు అప్లై చేశారు..