- Home
- Sports
- Cricket
- టీ20 వరల్డ్ కప్ ముందు బీసీసీఐ మాస్టర్ ప్లాన్... మెంటల్ కండీషనింగ్ కోచ్‌గా ప్యాడీ అప్టన్ రీఎంట్రీ...
టీ20 వరల్డ్ కప్ ముందు బీసీసీఐ మాస్టర్ ప్లాన్... మెంటల్ కండీషనింగ్ కోచ్‌గా ప్యాడీ అప్టన్ రీఎంట్రీ...
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ వార్మప్ మ్యాచుల్లో దుమ్మురేపే పర్ఫామెన్స్ ఇచ్చిన భారత జట్టు, కీలక మ్యాచుల్లో చేతులు ఎత్తేసింది. కారణం మెంటల్ ప్రెషర్. కీలక మ్యాచుల్లో ఒత్తిడిని తట్టుకోలేక ఫెయిల్ అవుతూ ఉంటారు భారత ఆటగాళ్లు. దీనికి కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మినహాయింపు కాదు..

ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో కూడా టైటిల్ ఫెవరెట్లలో ఒకటిగా బరిలో దిగుతోంది భారత జట్టు. ద్వైపాక్షిక సిరీసుల్లో పరాజయమే లేకుండా వరుస విజయాలతో రికార్డులు క్రియేట్ చేసిన రోహిత్ సేనపై భారీ అంచనాలు నెలకొన్నాయి...
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్ స్టార్లు ఫామ్‌లో లేకపోయినా రిషబ్ పంత్, జస్ప్రిత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్ వంటి ప్లేయర్లు సూపర్ ఫామ్‌లో ఉండి, వరుస విజయాలు అందిస్తున్నారు...
అయితే ప్లేయర్లను మానసికంగా కూడా మెగా టోర్నీలకు సిద్ధం చేసేందుకు మరో అడుగు ముందుకు వేసింది బీసీసీఐ. 2011 వన్డే వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన మెంటల్ కండీషనింగ్ కోచ్ ప్యాడీ అప్టన్‌ని తిరిగి భారత జట్టు సహాయ బృందంలోకి తీసుకొచ్చింది...
Paddy Upton
జూలై చివరి వారంలో భారత జట్టులో చేరిన ప్యాడీ అప్టన్, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ముగిసే వరకూ భారత జట్టుకి మెంటల్ స్ట్రెంగ్త్ కోచ్‌గా వ్యవహరించబోతున్నారు...
గతంలో రాజస్థాన్ రాయల్స్ టీమ్‌కి రాహుల్ ద్రావిడ్, ప్యాడీ అప్టన్ కలిసి పని చేశారు. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరూ టీమిండియా కోసం కలిసి పని చేయబోతున్నారు...
2011 వన్డే వరల్డ్ కప్ సమయంలో టీమిండియాకి కోచ్‌గా వ్యవహరించిన గ్యారీ కిర్‌స్టన్, ప్యాడీ అప్టన్‌ను ప్రత్యేకంగా పిలిపించి మరీ మెంటల్ కండీషనింగ్ కోచ్‌గా బాధ్యతలు అప్పగించాడు. ఆ టైమ్‌లో ప్యాడీ అప్టన్‌కి భారీగా ముట్టజెప్పిన బీసీసీఐ, ఈసారి మూడు నెలల కాలానికే భారీ మొత్తం చెల్లించబోతున్నట్టు సమాచారం...
ఆటగాళ్లపై క్రికెట్, పర్ఫామెన్స్, షెడ్యూల్స్, కీ బాటిల్స్ కారణంగా మానసిక ఒత్తిడి పడకుండా, వారి మెంటల్ కండీషన్ ఎప్పుడు ఒకేలా ఉండడం చూడడమే అప్టన్ పని...
పెద్దగా పనికి రాని ద్వైపాక్షిక సిరీసుల్లో చెలరేగిపోయే పర్ఫామెన్స్ ఇచ్చి, కీలక మ్యాచుల విషయానికి వచ్చేసరికి ఊసురుమనిపించే భారత క్రికెటర్ల మెంటల్ స్ట్రెంగ్త్‌ని ప్యాడీ ఎలా మారుస్తాడో చూడాలి...