- Home
- Sports
- Cricket
- బ్యాటులు పక్కోడి పెళ్లాం లాంటివి... తన కామెంటరీతో అతనికి కౌంటర్ ఇచ్చిన దినేశ్ కార్తీక్..
బ్యాటులు పక్కోడి పెళ్లాం లాంటివి... తన కామెంటరీతో అతనికి కౌంటర్ ఇచ్చిన దినేశ్ కార్తీక్..
అంతర్జాతీయ క్రికెట్‌కి ఇంకా రిటైర్మెంట్ ప్రకటించకముందే కామెంటేటర్‌గా అవతారం ఎత్తిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్, తనదైన స్టైల్‌లో కామెంటరీ చెబుతూ ఇప్పటికీ సెంట్ మార్కులు కొట్టేశాడు. అయితే ఇంగ్లాండ్, శ్రీలంక మధ్య జరిగిన రెండో వన్డేలో డీకే చేసిన ఓ కామెంట్ తీవ్ర వివాదాస్పదమయ్యేలా ఉంది...

డబ్ల్యూటీసీ ఫైనల్‌కి కామెంటరీ చెప్పడానికి ఇంగ్లాండ్ వెళ్లిన దినేశ్ కార్తీక్, అక్కడే ఉండి ఇంగ్లాండ్, శ్రీలంక మధ్య జరుగుతున్న వన్డే, టీ20 మ్యాచులకు కూడా కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు.

తొలి రెండు వన్డేల్లో శ్రీలంకను చిత్తు చేసింది ఇంగ్లాండ్ జట్టు. అయితే రెండో వన్డేలో టెస్టు కెప్టెన్ జో రూట్, వన్డే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ క్రీజులో ఉన్న సమయంలో దినేశ్ కార్తీక్ చేసిన ఓ కామెంట్ హాట్ టాపిక్ అయ్యింది...

‘బ్యాటులు ఎప్పుడూ పక్కింటోడి పెళ్లాంలాంటివి. ఎప్పుడూ పక్కవాడివే బాగున్నట్టు అనిపిస్తాయి...’ అంటూ కామెంట్ చేశాడు. అయితే భార్యలకు కూడా ఓ వ్యక్తిత్వం ఉంటుందని మరిచిపోయి, వాళ్లను బ్యాటులతో పోల్చడాన్ని కొందరు మహిళా సంఘాల వాళ్లు తప్పుబడుతున్నారు.

బ్యాటు అనేది ఓ క్రికెటర్‌కి సంబంధించిన వస్తువు లేదా ఆస్తి అని... అలాగే భార్యని కూడా భర్త ప్రోపర్టీ అనే అర్థం వచ్చేలా దినేశ్ కార్తీక్ చేసిన కామెంట్లు ఉన్నాయి. వెంటనే మహిళలందరికీ దినేశ్ కార్తీక్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికే ‘దినేశ్ కార్తీక్ అపాలజీ’ పేరుతో హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తన కామెంటరీతో ట్రెండ్ అయిన దినేశ్ కార్తీక్, ఇప్పుడు అధిక ప్రసంగంతో వార్తల్లో నిలిచాడని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

అయితే వాస్తవానికి ఈ కామెంట్‌తో దినేశ్ కార్తీక్, తన మాజీ స్నేహితుడు మురళీ విజయ్‌కి కౌంటర్ ఇవ్వాలని భావించాడు. దినేశ్ కార్తీక్ మాజీ భార్య నికితాతో తన సహచర క్రికెటర్ మురళీ విజయ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు...

మురళీ విజయ్‌కీ, తన భార్యకీ మధ్య జరుగుతున్న తంతగం చాలా ఆలస్యంగా తెలుసుకున్న దినేశ్ కార్తీక్, వెంటనే ఆమెకి విడాకులు ఇచ్చేశాడు. ఈ సంఘటన తర్వాత మురళీ విజయ్, దినేశ్ కార్తీక్ మధ్య మాటల్లేవు..

మురళీ విజయ్, నికితాను పెళ్లి చేసుకోగా... దినేశ్ కార్తీక్, భారత స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్‌ను ప్రేమించి పెళ్లాడాడు. ఆ సంఘటనను గుర్తు చేసుకుని దినేశ్ కార్తీక్ ఇలా పక్కోడి పెళ్లాంతో పోల్చి ఉంటాడని అంటున్నారు డీకే ఫ్యాన్స్...

దినేశ్ కార్తీక్ చేసిన కామెంట్లు ఒకేసారి సోషల్ మీడియాలో పాజిటివ్ ఫాలోయింగ్‌నీ, నెగిటివ్ ఫీడ్‌బ్యాక్‌నీ తెచ్చిపెట్టాయి. కొందరైతే వెంటనే అతన్ని కామెంటరీ ప్యానెల్ నుంచి తప్పించాలంటూ డిమాండ్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు.

ఐపీఎల్ 2020 సీజన్ సమయంలో అనుష్క శర్మతో చేసిన ప్రాక్టీస్ ఇక్కడ సరిపోదంటూ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చేసిన కామెంట్లపై తీవ్ర దుమారం లేచింది. తాను ఆ ఉద్దేశంతో అనలేదని గవాస్కర్ వివరణ ఇచ్చినా, అనుష్క ఆయనపై సీరియస్ అయిన విషయం తెలిసిందే.