కృనాల్ పాండ్యా తిట్టాడని ఫిర్యాదు... దీపక్ హుడాకే షాక్ ఇచ్చిన బరోడా...
సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 ప్రారంభానికి ఒక్క రోజు ముందు బరోడా జట్టు కెప్టెన్ కృనాల్ పాండ్యాపై సంచలన ఆరోపణలు చేశాడు వైస్ కెప్టెన్ దీపక్ హుడా. అయితే కంప్లైయింట్ చేసిన హుడాకే దిమ్మతిరిగే షాక్ ఇస్తూ సస్పెషన్ వేటు వేసింది బరోడా క్రికెట్ అసోసియేషన్.

సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ కోసం తాను ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కెప్టెన్ కృనాల్ పాండ్యా, తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, తిడుతూ అవమానించాడని ఆరోపించాడు దీపక్ హుడా..

కృనాల్ పాండ్యా ప్రవర్తనతో మనస్థాపం చెందిన తాను, సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు దీపక్ హుడా...

దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కౌన్సిల్... దీపక్ హుడాపై ఏడాది పాటు దేశవాళీ సీజన్‌లో బరోడాకి ప్రాతినిధ్యం వహించకూడదంటూ నిషేధం విధించింది.

‘దీపక్ హుడా ఫిర్యాదును స్వీకరించిన బరోడా జట్టు, మేనేజర్, కోచ్, మిగిలిన ఆటగాళ్ల వద్ద నివేదికలు స్వీకరించింది. ఆ నివేదికల ఆధారంగా దీపక్ హుడా క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహారించాడని తేలింది...

బయో బబుల్‌లో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో పాల్గొంటున్న ఆటగాళ్లు, సెక్యూలర్ జోన్ దాటి బయటికి వెళ్లకూడదు. అయితే ఈ నిబంధనను ఉల్లంఘించి, బయటికి వెళ్లడానికి ప్రయత్నించాడని దీనికి అంగీకరించని కారణంగానే కృనాల్‌పై ఆరోపణలు చేశారని తేల్చారు.

దీంతో పూర్తి స్థాయి విచారణ అనంతరం దీపక్ హుడాను ఏడాది పాటు దేశవాళీ టోర్నీలో పాల్గొనకుండా నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది బరోడా క్రికెట్ అసోసియేషన్..

సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 ప్రారంభమైన తర్వాత కృనాల్ పాండ్యా తండ్రి మరణించడంతో అతను కూడా ఈ టోర్నీ నుంచి అర్థాంతరంగా తప్పుకున్నాడు. ప్రస్తుతం బరోడా జట్టుకి కేదార్ దేవ్‌దర్ కెప్టెన్‌గా వ్యవహారిస్తున్నాడు.

బరోడా తరుపున 46 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన దీపక్ హుడా... 123 టీ20 మ్యాచుల్లో పాల్గొన్నాడు. మొత్తంగా దేశవాళీ క్రికెట్‌లో 5600లకు పైగా పరుగులు చేసిన దీపక్ హుడా గత సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరుపున ఆడాడు.