- Home
- Sports
- Cricket
- అందుకే మా ఆయన్ని ఏ ఫ్రాంఛైజీ కొనలేదు... బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ భార్య ఉమ్మే...
అందుకే మా ఆయన్ని ఏ ఫ్రాంఛైజీ కొనలేదు... బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ భార్య ఉమ్మే...
ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఫారిన్ సీనియర్ క్రికెటర్లను పెద్దగా పట్టించుకోలేదు ఫ్రాంచైజీలు. ఇంగ్లాండ్ వైట్ బాల్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, ఆస్ట్రేలియా వైట్ బాల్ కెప్టెన్ ఆరోన్ ఫించ్‌తో పాటు స్టీవ్ స్మిత్ వంటి సీనియర్లు వేలంలో అమ్ముడుపోలేదు. ఈ లిస్టులో బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడా ఉన్నాడు...

ఐపీఎల్ 2021 సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరుపున ఆడిన షకీబ్ అల్ హసన్, బ్యాటింగ్‌లో పెద్దగా రాణించలేకపోయినా బౌలింగ్‌లో మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు...
తాజాగా సోషల్ మీడియా ద్వారా షకీల్ అల్ హసన్‌ని ఫ్రాంఛైజీలు కొనకపోవడానికి గల కారణాలను చెప్పుకొచ్చింది అతని భార్య షకీబ్ ఉమ్మే హసన్ ఆలీ...
‘షకీబ్ అల్ హసన్, ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోలేదని చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు. దానికంటే ముందు మీకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నా...
ఐపీఎల్ వేలానికి ముందు కొన్ని ఫ్రాంఛైజీలు, షకీబ్ అల్ హసన్‌ను సంప్రదించాయి. సీజన్ మొత్తానికి అందుబాటులో ఉంటాడా? లేదా? అనే ఆరా తీశాయి...
అయితే శ్రీలంక సిరీస్ ఉన్నందున షకీబ్ అల్ హసన్, ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడలేనని చెప్పేశాడు. అందుకే అతన్ని ఏ జట్టూ తీసుకోలేదు...
ఐపీఎల్‌లో అమ్ముడుపోకపోవడం పెద్ద పొరపాటేం కాదు. ఇదే ముగింపు కూడా కాదు. వచ్చే ఏడాది ఉంది. షకీబ్‌కి ఇంకొన్నాళ్లు ఆడే సత్తా ఉంది...
అయినా కావాలనుకుంటే షకీబ్, శ్రీలంక సిరీస్ నుంచి తప్పుకుని ఐపీఎల్‌లో పాల్గొనవచ్చు. కానీ డబ్బుల కంటే దేశానికి ఆడడాన్నే గౌరవంగా భావించాడు..
ఒకవేళ శ్రీలంక సిరీస్ నుంచి తప్పుకుని, ఐపీఎల్ వేలంలో భారీ ధర దక్కించుకుని ఉంటే ఏం అనేవాళ్లు? అప్పుడు కూడా దేశం కంటే డబ్బులే ముఖ్యమా? అనేవాళ్లు కదా..
షకీబ్ అమ్ముడుపోలేదని తెగ ఆనందపడిపోతున్న మీ సంతోషంపై నీళ్లు చల్లుతున్నందుకు క్షమించండి...’ అంటూ రాసుకొచ్చింది షకీబ్ అల్ హసన్ సతీమణి షకీబ్ ఉమ్మే అల్ హసన్..
షకీబ్ అల్ హసన్ భార్య ఉమ్మే, శ్రీలంక సిరీస్ అని పోస్టు చేసినప్పటికీ బంగ్లాదేశ్ జట్టు నిజానికి మార్చి చివరన సౌతాఫ్రికా టూర్‌కి వెళ్లనుంది...
మార్చి 18 నుంచి మొదలయ్యే ఈ టూర్‌లో సౌతాఫ్రికాతో మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచులు ఆడుతుంది బంగ్లాదేశ్... ఏప్రిల్ 12న ఈ టూర్ ముగియనుంది..