విరాట్ కోహ్లీకి ఆ విధంగానూ చెక్ పెట్టేసిన బీసీసీఐ... మాజీ సారథి నూరో టెస్టుకి...
విరాట్ కోహ్లీ... వరల్డ్ క్రికెట్‌లో రియల్ సూపర్ స్టార్. టీ20ల రాకతో కాలం చెల్లిన టెస్టులకు పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టిన కెప్టెన్. అయితే కొంతకాలంగా విరాట్ కోహ్లీకి సమయం ఏ మాత్రం బాలేదు...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ముందు పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్న విరాట్ కోహ్లీ, నాలుగు నెలల గ్యాప్‌లో మూడు ఫార్మాట్ల కెప్టెన్సీని వదులుకున్నాడు...
భారత క్రికెట్ బోర్డు పెద్దలకూ, విరాట్ కోహ్లీకి మధ్య సత్సంబంధాలు లేవని బయటికి చెప్పకపోయినా క్రికెట్ ఫ్యాన్స్‌కి క్లియర్‌గా తెలుస్తోంది...
ఐపీఎల్, ఆర్‌సీబీ కారణంగా తనకు సొంత మైదానంలా మారిన బెంగళూరులో వందో టెస్టు ఆడాలని భావించాడు విరాట్ కోహ్లీ. అయితే బీసీసీఐ, శ్రీలంకతో టెస్టు సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు చేయడంతో వేదిక మొహాలీకి మారింది...
ప్రస్తుతం ధర్మశాలలో జరుగుతున్న మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతిస్తున్నారు. దీంతో మొహాలీలో కోహ్లీ వందో టెస్టు చూసేందుకు విరాట్ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు...
అయితే పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ మాత్రం మొహాలీలో టెస్టు మ్యాచ్‌కి ప్రేక్షకులను అనుమతించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు...
మార్చి 4 నుంచి శ్రీలంక, భారత్ మధ్య జరిగే తొలి టెస్టు ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియంలో, మూసి ఉంచిన గేట్ల లోపల జరుగుతుందని తెలిపింది బీసీసీఐ...
అయితే విరాట్ కోహ్లీ నూరో టెస్టును దగ్గర్నుంచి వీక్షించడానికి ఆయన కుటుంబానికి మాత్రం అనుమతి ఇచ్చింది పంజాబ్ క్రికెట్ బోర్డు...
మార్చి 12 నుంచి బెంగళూరు మధ్య జరిగే డే నైట్ టెస్టుకి మాత్రం ప్రేక్షకులను అనుమతించే అవకాశం ఉందని సమాచారం...
విరాట్ కోహ్లీని అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతూ, అతనికి ఏ కాస్త ఆనందం కూడా మిగలకుండా ఉండేందుకు బీసీసీఐ... పక్కా ప్లానింగ్ ప్రకారమే ఇలా చేసిందని అంటున్నారు అతని ఫ్యాన్స్...
అయితే విరాట్ ఫ్యాన్స్ మాత్రం కోహ్లీ నూరో టెస్టును గుర్తిండిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కోహ్లీ టీమ్ హోటల్ నుంచి బయలుదేరి, స్టేడియానికి చేరివరకూ ఉండే దారి పోడవునా విరాట్ భారీ కటౌట్లు ఏర్పాట్లు చేస్తున్నారు...
అలాగే మ్యాచ్ జరిగినన్ని రోజులు, బీసీసీఐ బస్సుతో పాటు స్టేడియం వరకూ వేల సంఖ్యలో విరాట్ ఫ్యాన్స్... ర్యాలీ ఏర్పాటు చేసి, విరాట్ కోహ్లీకి ఘన స్వాగతం పలకాలని ప్లాన్స్ చేస్తున్నారని సమాచారం...