- Home
- Sports
- Cricket
- కోహ్లీ స్థాయికి చేరాలంటే కెప్టెన్సీ నుంచి తప్పుకో... బాబర్ ఆజమ్‌కి కమ్రాన్ అక్మల్ సలహా...
కోహ్లీ స్థాయికి చేరాలంటే కెప్టెన్సీ నుంచి తప్పుకో... బాబర్ ఆజమ్‌కి కమ్రాన్ అక్మల్ సలహా...
కొన్నాళ్లుగా మూడు ఫార్మాట్లలో పరుగుల వరద పారిస్తూ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొడుతున్నాడు పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్. అయితే ఆసియా కప్ 2022 టోర్నీలో మాత్రం బాబర్ ఆజమ్ పెద్దగా రాణించలేకపోయాడు. ఆరు మ్యాచుల్లో కలిపి 68 పరుగులే చేసిన బాబర్ ఆజమ్, స్వదేశంలో ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కి సిద్ధమవుతున్నాడు...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు ఇంగ్లండ్‌తో కలిసి స్వదేశంలో ఏడు టీ20 మ్యాచులు ఆడుతోంది పాకిస్తాన్. ఆసియా కప్ 2022 ఫైనల్‌లో ఓడిన పాకిస్తాన్, ఈ మ్యాచుల్లో గెలిచి టైటిల్ ఫెవరెట్‌గా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టాలని చూస్తోంది...
Babar Azam
అయితే బాబర్ ఆజమ్ ఫామ్, పాకిస్తాన్ ఫ్యాన్స్‌ని తీవ్రంగా కలవరబెడుతోంది. విరాట్ కోహ్లీ కంటే బెస్ట్ బ్యాటర్ అని పాక్ మాజీల ప్రశంసలు దక్కించుకున్న బాబర్ ఆజమ్‌ని కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సిందిగా సలహా ఇస్తున్నాడు ఆ దేశ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్...
Babar Azam
‘ఫైసలాబాద్‌లో జరిగిన టీ20లో బాబర్ ఆజమ్ టాస్ కోసం వెళ్లినప్పుడు అతన్ని కెప్టెన్‌గా చేశారనే విషయం నాకు తెలిసింది. అప్పుడు నేను అతనితో చెప్పాను, ‘నువ్వు కెప్టెన్‌గా మారడానికి ఇది సరైన సమయం కాదు. మరో రెండు మూడేళ్లు నీ బెస్ట్ పర్ఫామెన్స్ ఇవ్వు. ఇప్పుడు పాక్ బ్యాటింగ్ లైనప్ అంతా నీపైనే ఆధారపడి ఉంది...
Image Credit: Getty Images
విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్ స్థాయికి చేరుకో... నువ్వు 35-40 అంతర్జాతీయ సెంచరీలు చేసిన తర్వాత కెప్టెన్సీని ఎంజాయ్ చేయొచ్చు. సర్ఫరాజ్ అహ్మద్ తప్పుకోగానే ఆ ప్లేస్‌లో బాబర్ ఆజమ్‌ని ఎక్కించారు. ఇది అతనికి మోయలేని భారమే...
ఆ రోజు కూడా అతనికి చెప్పాను, ఇప్పుడే సరైన నిర్ణయం తీసుకోమ్మని. అతనికి దగ్గరగా ఉండేవాళ్లు, ఆత్మీయులుగా భావించేవాళ్లు... కెప్టెన్సీ తీసుకొమ్మని సలహా ఇచ్చారు. నేను మాత్రం అతన్ని బ్యాటింగ్‌పైనే శ్రద్ధ పెట్టమని చెప్పాను...
అతను బాగా పరుగులు చేస్తున్నాడు. నిలకడగా రాణిస్తున్నాడు. కెప్టెన్సీ కారణంగా దానికి బ్రేకులు పడకూడదు. ఇప్పుడు అదే అతని బ్యాటింగ్‌లో కనబడుతోంది. అయితే ఇప్పటికిప్పుడు అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించడం కూడా తప్పే అవుతుంది...
Babar Azam
అతనికి కాస్త సమయం ఇవ్వండి. బాబర్ ఇప్పుడు మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తున్నాడు. అతనికి రెండుమూడేళ్ల కెప్టెన్సీ అనుభవం కూడా వచ్చింది. ఆసియా కప్ ఫైనల్‌లో అతను టీమ్‌ని నడిపించిన విధానం కంటే బాబర్ ఆజమ్ చాలా మంచి విజయాలు అందుకున్నాడు...
babar azam
బౌలర్లను ఎలా వాడుకోవాలో అతనికి బాగా తెలుసు. ఫామ్‌లో లేనప్పుడు బ్యాటింగ్ ఆర్డర్‌లో కొన్ని మార్పులు చేస్తే సరిపోతుంది. ఫకార్ జమాన్‌ని ఓపెనర్‌గా పంపించి, బాబర్ ఆజమ్ వన్‌డౌన్‌లో వస్తే ఫామ్‌లోకి రావడానికి అవకాశం దొరుకుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్..