- Home
- Sports
- Cricket
- ఇంగ్లాండ్ టూర్ నుంచి ఏకంగా ముగ్గురు ప్లేయర్లు అవుట్... టీమిండియాను వేధిస్తున్న గాయాలు...
ఇంగ్లాండ్ టూర్ నుంచి ఏకంగా ముగ్గురు ప్లేయర్లు అవుట్... టీమిండియాను వేధిస్తున్న గాయాలు...
ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ఇంకా మొదలుకానేలేదు. అప్పుడు భారత జట్టును గాయాలు వేధించడం మొదలెట్టాయి. ఇప్పటికే ఓపెనర్ శుబ్‌మన్ గిల్ గాయం కారణంగా సిరీస్‌కి దూరం కాగా, ఇప్పుడు ఆ లిస్టులో మరో ఇద్దరు ప్లేయర్లు చేరారు.

కౌంటీ సెలక్ట్ ఎలెవన్ తరుపున బరిలో దిగిన ఆవేశ్ ఖాన్, బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు. అతని వేలికి రక్తస్రావం కావడంతో ఓవర్ ముగించకుండా పెవిలియన్ చేరాడు...

అతని వేలికి స్కానింగ్ చేసిన డాక్టర్లు, నెల రోజుల పాటు విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికైన ఆవేశ్ ఖాన్, అర్ధాంతరంగా టెస్టు సిరీస్ నుంచి తప్పుకోనున్నాడు.

అలాగే కౌంటీ ఎలెవన్ తరుపున బరిలో దిగిన భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా గాయం కారణంగా టెస్టు సిరీస్‌కి దూరమయ్యాడు. సుందర్‌కి కూడా వేలికి గాయమైనట్టు తెలుస్తోంది...

ఆస్ట్రేలియాలో జరిగిన ఆఖరి టెస్టులో ఎంట్రీ ఇచ్చి తొలి ఇన్నింగ్స్‌లోనే హాఫ్ సెంచరీ బాదిన వాషింగ్టన్ సుందర్, ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లోనూ 96 పరుగులతో అజేయంగా నిలిచి రాణించాడు....

ఆవేశ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్‌లతో కలిపి ఇంగ్లాండ్ సిరీస్ ఆరంభానికి ముందే జట్టుకి దూరమైన ప్లేయర్ల సంఖ్య మూడుకి చేరింది. 24 మంది ప్లేయర్లతో ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లిన జట్టులో ఇప్పుడు 21 మంది ప్లేయర్లే అందుబాటులో ఉన్నారు.

ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ కావడంతో గాయపడిన ప్లేయర్ల స్థానంలో రిప్లేస్‌మెంట్ కావాలని టీమిండియా, బీసీసీఐ సెలక్టర్లను కోరే అవకాశం ఉంది.

ఇదే జరిగితే ప్రస్తుతం శ్రీలంక సిరీస్‌లో ఉన్న భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహార్, హార్ధిక్ పాండ్యాలకు ఇంగ్లాండ్ టూర్‌లో ఆడే అవకాశం రావచ్చని అంచనా వేస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు...

ఆగస్టు 4 నుంచి ప్రారంభమయ్యే ఇండియా, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్, డబ్ల్యూటీసీ 2021-23 సీజన్‌లో ఇరుజట్లకి మొట్టమొదటి సిరీస్. సెప్టెంబర్ 15 వరకూ సాగే ఈ సిరీస్ ముగించుకున్న తర్వాత ఐపీఎల్ కోసం యూఏఈ చేరుకుంటుంది భారత జట్టు.