తండ్రి అయ్యాక పెళ్లి చేసుకున్న ప్యాట్ కమ్మిన్స్... 9 నెలల కొడుకుతో కలిసి...
ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్, ఐసీసీ నెం.1 టెస్టు బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు. కొడుకు పుట్టిన 9 నెలలకు పెళ్లి చేసుకున్నాడు. శుక్రవారం జూలై 29న బైరన్ బేలో తన ఫియాన్సీ బెక్కీ బాస్టన్‌ని క్రైస్తవ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నాడు ప్యాట్ కమ్మిన్స్...

Pat Cummins Marriage
2013లో బెక్కీ బాస్టన్‌కీ ప్యాట్ కమ్మిన్స్‌కి తొలిసారి పరిచయమైంది. ఆ పరిచయం స్నేహంగా, ప్రేమగా మారి ఈ ఇద్దరూ కొన్నేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. జూన్ 2020లో వీరిద్దరికి ఎంగేజ్‌మెంట్ జరిగింది...
2021 అక్టోబర్‌లో బెక్కీ బాస్టన్, ప్యాట్ కమ్మిన్స్‌లకు ఓ కొడుకు జన్మించాడు. కొడుక్కి అల్బీ అని నామకరణం చేసిన కమ్మిన్స్ కపుల్.. బాబు పుట్టిన 9 నెలలకు పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు...
Pat cummins
ప్యాట్ కమ్మిన్స్, బెక్కీ కలిసి సిడ్నీలో ఓ విలాసవంతమైన భవంతిలో నివసిస్తున్నారు. ఈ భవంతి ఖరీదు 9.5 మిలియన్ పౌండ్లు (53 కోట్ల రూపాయలకు పైనే). అలాగే వీరికి సౌథరన్ హైలాండ్స్‌లోనూ ఓ కాటేజీ ఉంది. దాని విలువ రూ.51 కోట్లకు పైనే...
ఈ వివాహ వేడుకకు ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్, ఆయన సతీమణి ఎమ్మా మెక్‌క్యాథీతో పాటు కమ్మిన్స్ క్లోజ్ ఫ్రెండ్, కమేడియన్ ఆండీ లీ, ఆసీస్ మాజీ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్, క్రికెటర్లు ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్, ఆండ్రూ మెక్‌డొనాల్డ్, జోష్ హజల్‌వుడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు...
టిమ్ పైన్ సెక్స్ ఛాట్ స్కాండల్‌లో ఇరుక్కోవడంతో అతని నుంచి టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు టిమ్ పైన్. పైన్ కెప్టెన్సీలో యాషెస్ సిరీస్ గెలిచిన ఆస్ట్రేలియా, డబ్ల్యూటీసీ 2021-23 సీజన్‌లో 10 మ్యాచుల్లో 6 విజయాలతో రెండో స్థానంలో కొనసాగుతోంది...
ఆసీస్ క్రికెటర్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ప్లేయర్ ప్యాట్ కమ్మిన్స్ గర్ల్‌ఫ్రెండ్ బెక్కీ బాస్టన్ హాట్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు... (Instagram/Becky-boston)