విరాట్ కోహ్లీ ఆ వీడియో చూసి, గట్టిగా నవ్వాడు... నాకు అలా వాట్సాప్ చేశాడు.. ఆడమ్ జంపా వ్యాఖ్యలు...
First Published Nov 23, 2020, 2:50 PM IST
విరాట్ కోహ్లీ... మోస్ట్ అగ్రెసివ్ కెప్టెన్. ఎవ్వరైనా ఫీల్డర్ క్యాచ్ జారవిడిచినా, ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ బౌండరీలు బాదుతున్నా ఆవేశంతో ఊగిపోతూ కోపంగా కనిపిస్తాడు విరాట్ కోహ్లీ. అయితే మనం మైదానంలో చూసే విరాట్ కోహ్లీ వేరని, బయట నడుచుకునే విరాట్ వేరని అంటున్నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ ఆడమ్ జంపా. ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా, విరాట్ కోహ్లీ యాటిట్యూడ్‌కి, సహచరులతో అతను ప్రవర్తించే తీరు చూసి ఆశ్చర్యపోయారట.

ఆస్ట్రేలియా యంగ్ స్పిన్నర్ ఆడమ్ జంపాను మొదట వేలంలో కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. రెండో రౌండ్‌లో కోటిన్నర చెల్లించి ఆడమ్ జంపాను కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

ఆర్‌సీబీలో భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్ అద్భుతంగా రాణిస్తుండడంతో ఆడమ్ జంపాను కేవలం మూడు మ్యాచుల్లోనే ఆడించాడు విరాట్ కోహ్లీ... అయితే సీజన్ మొత్తం విరాట్ కోహ్లీ టీమ్‌తో కొనసాగిన జంపా, ఆర్‌సీబీ కెప్టెన్ క్యారెక్టర్‌కి ఫిదా అయ్యాడట.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?