భారీ ఆధిక్యంలోకి ఆస్ట్రేలియా... స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ... సైనీకి రెండు వికెట్లు...
First Published Jan 10, 2021, 7:15 AM IST
మూడో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా పట్టు సాధించింది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ చేసిన తప్పుల కారణంగా లభించిన ఆధిక్యాన్ని, రెండో ఇన్నింగ్స్‌లో అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది. లంచ్ సమయానికి ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో దక్కిన 94 పరుగుల ఆధిక్యంతో కలిపి 276 పరుగుల భారీ లీడ్ సాధించింది ఆస్ట్రేలియా.

నాలుగో రోజు ఆట ప్రారంభమైన రెండో బంతికే లబుషేన్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను జారవిడిచాడు హనుమ విహారి.... ఈ లైఫ్ తర్వాత ఆచితూచి బ్యాటింగ్ చేశారు లబుషేన్, స్మిత్...

మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన లబుషేన్, స్టీత్ స్మిత్... రెండో ఇన్నింగ్స్‌లో కూడా అదే ఫీట్ రిపీట్ చేశారు. మూడో వికెట్‌కి 103 పరుగుల భాగస్వామ్యం జోడించారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?