- Home
- Sports
- Cricket
- టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి ఆస్ట్రేలియా... ఆఖరి టెస్టులో ఓడితే టీమిండియాకి కష్టమే! రోహిత్ సేనకి...
టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి ఆస్ట్రేలియా... ఆఖరి టెస్టులో ఓడితే టీమిండియాకి కష్టమే! రోహిత్ సేనకి...
భారత పర్యటనలో మొదటి రెండు టెస్టుల్లో చిత్తుగా ఓడిన ఐసీసీ నెం.1 టెస్టు టీమ్ ఆస్ట్రేలియా, ఇండోర్‌లో ఘన విజయం అందుకుంది. రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లడంతో తాత్కాలిక సారథి స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా అద్భుతమై చేసింది.. ఈ విజయంతో ఆస్ట్రేలియా, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్‌కి నేరుగా అర్హత సాధించింది...

Image credit: PTI
తొలి రెండు టెస్టుల్లో ఓడిన తర్వాత ఆస్ట్రేలియా, ఫైనల్ ఛాన్సులు సన్నగిల్లాయి. ఇలాంటి ఆటతీరు సిరీస్ మొత్తం చూపిస్తే, ఆసీస్ ఫైనల్ చేరడం కష్టమే అనుకున్నారంతా. అయితే మూడో టెస్టులో భారత్‌లో భారత స్పిన్ పిచ్‌పై టీమిండియా బ్యాటర్లపై స్పిన్ మంత్రంతోనే గెలిచింది ఆస్ట్రేలియా...
Image credit: PTI
గట్టిగా చెబితే ఆరున్నర సెషన్లలోనే ముగిసిన మూడో టెస్టులో 9 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకున్న ఆస్ట్రేలియా.. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 సీజన్‌లో 11వ విజయం అందుకుని, ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది... ఫైనల్‌లో ఆస్ట్రేలియాని ఢీ కొట్టేందుకు శ్రీలంక, టీమిండియా మధ్య పోటీ జరగనుంది.
Image credit: PTI
మరో వైపు రెండో టెస్టు గెలిచిన తర్వాత 10 విజయాలతో రెండో స్థానంలో ఉన్న టీమిండియా... అహ్మదాబాద్‌లో నాలుగో టెస్టు గెలిచినా, కనీసం డ్రా చేసుకున్నా... ఫైనల్ చేరుతుంది. ఒకవేళ నాలుగో టెస్టులో కూడా ఓడితే మాత్రం టీమిండియా ఫైనల్ ఛాన్సులు సన్నగిల్లుతాయి..
Image credit: PTI
అప్పుడు శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య జరిగే రెండు టెస్టుల సిరీస్ రిజల్ట్ కోసం వేచి చూడాల్సి ఉంటుంది భారత జట్టు. ఒకవేళ నాలుగో టెస్టులో భారత జట్టు ఓడి, ఈ రెండు టెస్టుల సిరీస్‌లో శ్రీలంక, న్యూజిలాండ్‌ని క్లీన్ స్వీప్ చేస్తే.. ఆస్ట్రేలియా, లంక మధ్య టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరుగుతుంది..
Image credit: PTI
టీమిండియా నాలుగో టెస్టులో ఓడినా, న్యూజిలాండ్ జట్టు ఒక్క టెస్టులో శ్రీలంకను ఓడించినా, కనీసం డ్రా చేసుకున్నా... భారత జట్టు విన్నింగ్ పర్సేంటేజ్ కారణంగా ఆస్ట్రేలియాతో ఫైనల్ ఆడుతుంది. ఇండియా, ఆస్ట్రేలియా టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడే ఛాన్సులు 90 శాతం పైనే ఉన్నాయి...