- Home
- Sports
- Cricket
- ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్మిత్ పనికి రాడు... ప్యాట్ కమ్మిన్స్‌కే మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ...
ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్మిత్ పనికి రాడు... ప్యాట్ కమ్మిన్స్‌కే మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ...
సొంత గడ్డ మీద యువ భారత్ చేతిలో చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా... జట్టులో మార్పులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. స్టీవ్ స్మిత్ మీద నిషేధం పడడంతో టెంపరరీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి, టెస్టుల్లో ఆస్ట్రేలియాను నెం.1 జట్టుగా నిలిపిన టిమ్ పైన్‌పై ఈ ఓటమి ఎఫెక్ట్ తీవ్రంగా పడనుంది...

టీమిండియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో బ్యాట్స్‌మెన్‌గా పర్వాలేదనిపించినా... కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా ఘోరంగా విఫలమయ్యాడు టిమ్ పైన్...

ఆడిలైడ్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో బ్యాటుతోనే, వికెట్ కీపింగ్‌లోనూ, కెప్టెన్‌గానూ రాణించిన టిమ్ పైన్‌పై ప్రశంసల వర్షం కురిసింది... టెంపరరీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినా, అతను ఆసీస్‌ను నడిపిస్తున్న విధానం అద్భుతమని కొనియాడారు క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు...

ఆ తర్వాతే సీన్ మొత్తం మారిపోయింది. మిగిలిన మూడు టెస్టుల్లో రెండు మ్యాచుల్లో ఓడిన ఆస్ట్రేలియా... సిడ్నీ టెస్టులో చేతుల్లోకి వచ్చిన విజయాన్ని జారవిడుచుకుంది...

సిడ్నీ టెస్టులో హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ అద్భుత పోరాటంతో మ్యాచ్‌ను డ్రా చేసిన విషయం తెలిసిందే. అయితే 45 ఓవర్ల పాటు సాగిన ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టేందుకు ఆసీస్‌కి మూడు సార్లు అవకాశం వచ్చింది....

అయితే మూడు సార్లు ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ చేతుల్లోకి వచ్చిన క్యాచులను నేలవిడిచాడు... ఇదీకాకుండా అనవసరంగా అశ్విన్, విహారిపై నోరు పారేసుకున్నాడు టిమ్ పైన్...

ప్రస్తుతం ట్రోలింగ్‌కి టార్గెట్ అవ్వడానికి టిమ్ పైన్ నోటి దురదే కారణం... సెడ్జింగ్ పైన ఉన్న శ్రద్ధ, వికెట్ కీపింగ్ మీద, కెప్టెన్సీ మీద పెట్టి ఉంటే బాగుండేదని టిమ్ పైన్‌ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు...

టిమ్ పైన్ టెస్టు కెప్టెన్సీ పోవడం దాదాపు ఖాయమని తేలింది. అయితే ఆసీస్ తర్వాతి కెప్టెన్‌గా ప్యాట్ కమ్మిన్స్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది...

ఆసీస్ మాజీ సారథి స్టీవ్ స్మిత్‌కే మళ్లీ కెప్టెన్సీ దక్కే అవకాశం ఉందని టాక్ వినిపించినా... ‘స్పాట్ ఫిక్సింగ్’, ‘షాడో బ్యాటింగ్’, ‘డ్రెస్సింగ్ రూమ్ రివ్యూ’ వంటి వివాదాల్లో చిక్కుకున్న స్మిత్‌కి కెప్టెన్సీ ఇవ్వడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు...

దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో దూసుకుపోతున్న ప్యాట్ కమ్మిన్స్‌కి కెప్టెన్సీ అప్పగిస్తే బాగుంటుందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు...

‘ప్యాట్ కమ్మిన్స్ అద్భుతమైన బౌలర్. మంచి హిట్టర్ కూడా... ప్రస్తుత జట్టులో కమ్మిన్స్‌కి కెప్టెన్సీ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి... ఫామ్‌లో ఉంటే కమ్మిన్స్‌ను ఆపడం ఎవరి తరం కాదు...

బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ చెలరేగిపోయే ప్యాట్ కమ్మన్స్‌కి మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్సీ అప్పగిస్తే బాగుంటుంది...’ అంటూ ఆసీస్ మాజీ సారథి మైకేల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు...

టీమిండియాతో జరిగిన నాలుగు టెస్టుల్లో 21 వికెట్లు పడగొట్టిన ప్యాట్ కమ్మిన్స్, ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలుచుకున్నాడు...

34 టెస్టుల్లో 164 వికెట్లు తీసిన కమ్మిన్స్... టెస్టుల్లో నెం.1 బౌలర్‌గా కొనసాగుతున్నాడు. 69 వన్డేల్లో 111 వికెట్లు, 30 టీ20 మ్యాచుల్లో 37 వికెట్లు తీసిన కమ్మిన్స్‌ను గత ఐపీఎల్‌లో రూ.15.50 కోట్లకి కొనుగోలు చేసింది కేకేఆర్.