రిటైర్మెంట్ సమయం వచ్చేసింది... ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రకటన...
భారత్‌లో మంచి క్రేజ్, ఫాలోయింగ్ తెచ్చుకున్న విదేశీ క్రికెటర్ల లిస్టు తీస్తే డేవిడ్ వార్నర్ పేరే ముందువస్తుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా భారత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న డేవిడ్ వార్నర్, బాలీవుడ్, టాలీవుడ్ పాటలకు స్టెప్పులు వేసి ఇక్కడి వారికి మరింత చేరువయ్యాడు...
David Warner
ప్రస్తుత తరంలో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన ప్లేయర్లలో విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో ఉన్న డేవిడ్ వార్నర్, రిటైర్మెంట్‌పై కీలక ప్రకటన చేశాడు. ఈ ఏడాది చివర్లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోబోతున్నట్టు హింట్ ఇచ్చాడు డేవిడ్ వార్నర్...
david warner
‘నా అంతర్జాతీయ క్రికెట్‌కి ఇదే ఆఖరి ఏడాది కావచ్చు. 2024 టీ20 వరల్డ్ కప్ కూడా ఆడాలని అనుకుంటున్నా... అది ఆడితే అమెరికాలో కెరీర్‌ని ముగించవచ్చు.. అక్కడ గెలిచి, తప్పుకుంటే బాగుంటుంది...
David Warner
అయితే ఆ సమయానికి నేను సెలక్ట్ అవుతానో లేదో చెప్పలేను కదా.. సిడ్నీ థండర్ తరుపున ఆడేందుకు రెండేళ్ల అగ్రీమెంట్ చేసుకున్నా. బీబీఎల్‌లో రాణించేందుకు నా వంతు కృషి నేను చేస్తాను...
నేను టీ20ల కంటే టెస్టులు, వన్డేలు ఆడేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్, వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో చక్కగా ఆడేందుకు ప్రయత్నిస్తా.. ఆ టోర్నీలపైనే ఇప్పుడు నా ఫోకస్ అంతా ఉంది...’ అంటూ చెప్పుకొచ్చాడు డేవిడ్ వార్నర్...
Image credit: PTI
వచ్చే నెలలో భారత్ పర్యటనకు రానుంది ఆస్ట్రేలియా. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా భారత జట్టుతో నాలుగు టెస్టులు ఆడనుంది ఆస్ట్రేలియా. ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌లో తొలి టెస్టు జరుగుతుంది...
Image credit: Getty
ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కి మారిన డేవిడ్ వార్నర్, ఈ సీజన్‌లో ఆ జట్టుకి కెప్టెన్సీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో 2023 సీజన్‌కి దూరమయ్యాడు..
David Warner
రిషబ్ పంత్ స్థానంలో ఐపీఎల్ 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి టైటిల్ అందించిన డేవిడ్ వార్నర్, 2023 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి..