- Home
- Sports
- Cricket
- పడకొట్టిందీ మనమే, పైకెత్తిందీ మనమే... ఐసీసీ టోర్నీలన్నీ గెలిచిన మొదటి జట్టుగా ఆసీస్ రికార్డు...
పడకొట్టిందీ మనమే, పైకెత్తిందీ మనమే... ఐసీసీ టోర్నీలన్నీ గెలిచిన మొదటి జట్టుగా ఆసీస్ రికార్డు...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియాని 210 పరుగుల తేడాతో చిత్తు చేసి, టైటిల్ కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా. ఓవరాల్‌గా ఆస్ట్రేలియాకి ఇది 9వ ఐసీసీ టైటిల్...

Australia Cricket Team
వన్డే వరల్డ్ కప్‌ని నాలుగు సార్లు సొంతం చేసుకుని మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా ఉన్న ఆస్ట్రేలియా, 2009లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది..
2021లో టీ20 వరల్డ్ కప్ టోర్నీని గెలిచిన ఆస్ట్రేలియా, తాజాగా టీమిండియాని ఓడించి ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ కూడా గెలిచింది. దీంతో ఐసీసీ నిర్వహిస్తున్న అన్నీ టోర్నీలు గెలిచిన మొట్టమొదటి జట్టుగా ఆస్ట్రేలియా రికార్డు క్రియేట్ చేసింది..
టీమిండియా 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినా 2021, 2023 వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో ఓడి, ఈ అరుదైన ఫీట్‌ని చేజార్చుకుంది..
Australia v India
వరుసగా నాలుగు సార్లు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాని ఓడించి, ఆ టీమ్ ర్యాంకుని దిగజార్చిన టీమిండియా... ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఓడి మళ్లీ టాప్ ర్యాంకుని, ఐసీసీ టెస్టు గదను ఆసీస్‌కి అప్పగించేసింది..
Cummins-Rohit
9 ఐసీసీ టోర్నీలు గెలిచిన ఆస్ట్రేలియా, మోస్ట్ సక్సెస్‌ఫుల్ క్రికెట్ టీమ్‌గా ఉంటే టీమిండియా, వెస్టిండీస్ జట్లు ఐదేసి సార్లు ఐసీసీ టైటిల్స్ సాధించి రెండో స్థానంలో ఉన్నాయి. పాకిస్తాన్, శ్రీలంక, ఇంగ్లాండ్ మూడేసి సార్లు ఐసీసీ టైటిల్స్ గెలవగా న్యూజిలాండ్ రెండు సార్లు ఐసీసీ టైటిల్స్ విజేతగా నిలిచింది..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, యువరాజ్ సింగ్... నాలుగు సార్లు ఐసీసీ ఫైనల్స్ ఓటముల్లో భాగస్వాములుగా ఉన్నారు. లంక మాజీ ప్లేయర్లు కుమార సంగర్కర, తిలకరత్నే దిల్షాన్, మలింగ కూడా నాలుగేసి సార్లు ఫైనల్ చేరినా టైటిల్స్ గెలవలేకపోయారు..