- Home
- Sports
- Cricket
- నా జీవితంలో ఇలాంటి పిచ్‌లు ఎప్పుడూ చూడలేదు... పాకిస్తాన్ పర్యటనపై స్టీవ్ స్మిత్ కామెంట్...
నా జీవితంలో ఇలాంటి పిచ్‌లు ఎప్పుడూ చూడలేదు... పాకిస్తాన్ పర్యటనపై స్టీవ్ స్మిత్ కామెంట్...
దాదాపు 28 ఏళ్ల తర్వాత తొలిసారిగా పాకిస్తాన్‌లో పర్యటిస్తోంది ఆస్ట్రేలియా జట్టు. పాక్ పర్యటనలో జరిగిన మొదటి రెండు టెస్టులు ఐదు రోజుల పాటు సాగినా ఫలితం తేలకుండా డ్రాగా ముగిశాయి. లాహోర్‌లో జరుగుతున్న మూడో, ఆఖరి టెస్టు సిరీస్ ఫలితాన్ని నిర్ణయించనుంది...

ఓటమి భయంతో బ్యాటింగ్‌కి స్వర్గధామంగా పిచ్‌లను రూపొందిస్తున్నారంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది... ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కూడా ఇలాంటి ఓ మీమ్‌ని షేర్ చేశాడు...
పాకిస్తాన్ బోర్డు టెస్టు మ్యాచుల కోసం క్రికెట్ పిచ్‌లను కాకుండా తారు రోడ్డులను రూపొందిస్తున్నట్టుగా ఉందనే ఉద్దేశంలో డేవిడ్ వార్నర్ షేర్ చేసిన మీమ్, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది...
కరాచీ టెస్టులో పాకిస్తాన్‌ని తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరుకే ఆలౌట్ చేసిన ఆస్ట్రేలియా, రెండో ఇన్నింగ్స్‌లో దాదాపు ఐదు సెషన్ల పాటు బౌలింగ్ చేసినా ప్రత్యర్థిని ఆలౌట్ చేయలేకపోయింది.
రెండో టెస్టులో ఓ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్న స్టీవ్ స్మిత్, కీలక దశలో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ ఇచ్చిన క్యాచ్ డ్రాప్ చేయడం విజయంపై తీవ్రంగా ప్రభావం చూపింది...
అబ్దుల్లా, బాబర్ ఆజమ్ కలిసి మూడో వికెట్‌కి 228 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి, ఆస్ట్రేలియాకి విజయం దక్కకుండా చేశాడు. పాక్ కెప్టెన్ 196 పరుగులు చేసి అవుట్ కాగా, మహ్మద్ రిజ్వాన్ 104 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు...
‘ఈ పిచ్‌లపై బ్యాటింగ్ పెద్ద కష్టమేమీ కాదు. అసలైన ఛాలెంజ్ ఫీల్డింగ్ చేయడమే. నా జీవితంలో ఎప్పుడూ బ్యాట్‌కి ఇంత దగ్గరగా ఫీల్డింగ్ చేసింది లేదు... ఇది చాలా కష్టమేన పని...
ఈ పరిస్థితులకు అలవాటు పడడం చాలా కష్టం. ప్రాక్టీస్ సెషన్స్‌లో ఈ విషయంపై తీవ్రంగా కష్టపడుతున్నాం. బ్యాటుకి దగ్గరగా ఉంటే, లో క్యాచులను కూడా అందుకోవడానికి వీలుంటుంది...
బంతికి అడ్డుగా వేళ్లను పెడితే చాలు, క్యాచ్ అందుకోవచ్చు... ’ అంటూ చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, ప్రస్తుత వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్...
లాహోర్‌లో జరుగుతున్న మూడో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా, వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. డేవిడ్ వార్నర్ 7 పరుగులు చేసి షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు...
ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో నెం.1 పొజిషన్‌లో ఉన్న మార్నస్ లబుషేన్, ఆ తర్వాత రెండు బంతులకే రిజ్వాన్‌కి క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు...
పాకిస్తాన్ సిరీస్‌లో లబుషేన్‌కి ఇది రెండో డకౌట్. స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖవాజా కలిసి మూడో వికెట్‌కి 138 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 169 బంతుల్లో 6 ఫోర్లతో 59 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్, నసీన్ షా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు...