రూ.25 లక్షల వరకు రుణం.. సొంతింటి కలను నెరవేర్చే అద్భుతమైన పథకం
House Building Scheme: ఉద్యోగులకు తక్కువ వడ్డీతో రూ.25 లక్షల వరకు హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ రుణం అందించే అద్భుతమైన పథకం ఒకటి ఉంది. అదే హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ (HBA) పథకం. దీని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సొంతింటి కలను సాకారం చేసే పథకం
ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనే కల ఉంటుంది. అయితే పెరుగుతున్న ఆస్తి ధరలు, అధిక వడ్డీ రేట్లు కారణంగా ఈ కల చాలా మందికి అందని ద్రాక్షలా మారుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా భారంగానే మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగుల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది. అదే హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ (HBA) పథకం.
హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ (HBA) పథకంలో రూ.25 లక్షల వరకు రుణ సౌకర్యం
హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ (HBA) పథకం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గరిష్టంగా రూ.25 లక్షల వరకు అడ్వాన్స్ పొందవచ్చు. ఈ రుణాన్ని ఉద్యోగులు తమకు ఇప్పటికే ఉన్న బ్యాంక్ లేదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల రుణాలను తీర్చడానికి కూడా వినియోగించవచ్చు. హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ పథకం కింద వడ్డీ రేటు కేవలం 7.44% మాత్రమే ఉంటుంది. ఇది సాధారణ గృహ రుణాలతో పోలిస్తే చాలా తక్కువ.
హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ (HBA) పథకం వివరాలు
హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ పథకం ప్రకారం గరిష్టంగా 34 నెలల బేసిక్ పే లేదా రూ.25 లక్షలు (ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే అది) అడ్వాన్స్‌గా తీసుకోవచ్చు.
- ఇల్లును మరింత విస్తరించడం కోసం గరిష్టంగా రూ.10 లక్షలు లేదా 34 నెలల బేసిక్ పే లభిస్తుంది.
- భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే, ఇద్దరూ వేర్వేరుగా అడ్వాన్స్ పొందవచ్చు. అంటే మొత్తం రూ.50 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది.
- బేసిక్ పేలో నాన్-ప్రాక్టీసింగ్ అలవెన్స్, ఫ్యామిలీ పెన్షన్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ (HBA) పథకానికి ఎవరు అర్హులు?
హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ పథకానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ అర్హులు. అలాగే, కనీసం 5 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన తాత్కాలిక ఉద్యోగులు కూడా ఈ పథకం కింద రుణం పొందవచ్చు. అఖిల భారత సర్వీసుల సభ్యులు, కేంద్రపాలిత ప్రాంతాల ఉద్యోగులు, డెప్యుటేషన్‌పై పనిచేస్తున్న అధికారులు కూడా ఇందులోకి వస్తారు. సస్పెండ్ అయిన ఉద్యోగులు కూడా కొన్ని షరతులతో రుణం పొందవచ్చు.
హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ రుణం లో తక్కువ వడ్డీ
సాధారణ గృహ రుణాలపై వడ్డీ రేటు 9% నుంచి 11% వరకు ఉంటుంది. అయితే హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ పథకంలో వడ్డీ రేటు కేవలం 7.44% మాత్రమే. దీని వల్ల ఉద్యోగుల పై ఈఎంఐ భారం తగ్గుతుంది.
వడ్డీ రేటుపై రీఫండ్ సౌకర్యం
ఈ పథకం కింద రుణం తీసుకున్న ఉద్యోగులు కొన్ని షరతులతో వడ్డీపై రీఫండ్ కూడా పొందవచ్చు. అన్ని షరతులు పాటించినట్లయితే 2.5% రీఫండ్ లభిస్తుంది. ఇలా, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు గృహ నిర్మాణ కలను సాకారం చేసుకునే అవకాశం కల్పిస్తోంది. తక్కువ వడ్డీ రేటు, రీఫండ్ సౌకర్యం వంటి అంశాలు ఈ పథకాన్ని ప్రత్యేకంగా ఉంచుతున్నాయి.