AFG vs HKG : ఆసియా కప్ 2025 లో హాంకాంగ్ ను దంచికొట్టిన ఓమర్జాయ్
Asia Cup 2025 AFG vs HKG : ఆసియా కప్ 2025 తొలి మ్యచ్ లో ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లు సెదిఖుల్లా అటల్, ఓమర్జాయ్ లు సూపర్ నాక్ తో అదరగొట్టారు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ హాంకాంగ్ బౌలింగ్ ను దంచికొట్టారు.

ఆసియా కప్ 2025 తొలి మ్యాచ్: టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్
ఆసియా కప్ 2025 మంగళవారం ఘనంగా ప్రారంభం అయింది. ప్రారంభ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ జట్లు తలపడ్డాయి. ఆఫ్ఘనిస్తాన్ జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఈ మ్యాచ్ అబుదాబిలోని షేక్ జాయేద్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు అదరగొట్టారు.
పవర్‌ప్లేలో ఆఫ్ఘనిస్తాన్ కు షాక్
పవర్‌ప్లేలోనే ఆఫ్ఘనిస్తాన్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. తొలి 2.2 ఓవర్లలో 25 పరుగులకే రెహ్మానుల్లా గుర్బాజ్ (8) ఔటయ్యారు. వెంటనే ఇబ్రాహీం జాద్రాన్ కూడా కేవలం 1 రన్ చేసి వెనుదిరిగాడు. 6 ఓవర్లు ముగిసేసరికి ఆఫ్ఘనిస్తాన్ స్కోరు 56/2. ఈ దశలో సెదిఖుల్లా అటల్ 27, మహ్మద్ నబీ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Pin point precision 🎯
Ateeq bringing the heat, sending Zadran packing in what was an exceptional over! 🔥 #AFGvHK#DPWorldAsiaCup2025#ACCpic.twitter.com/Wo4FgaZqTa— AsianCricketCouncil (@ACCMedia1) September 9, 2025
మిడిల్ ఓవర్లలో ఆఫ్ఘనిస్తాన్ పోరాటం
10 ఓవర్లలో స్కోరు 81/3గా నిలిచింది. నబీ 33 పరుగులు చేసి ఔటయ్యాడు. కానీ అట్ల్ తన అర్ధసెంచరీ పూర్తి చేశాడు. 15 ఓవర్లలో స్కోరు 124/4కి చేరింది. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను మళ్లీ గాడిలో పెట్టింది ఓమర్జాయ్ బ్యాటింగ్.
Afghanistan end with 1️⃣8️⃣8️⃣ on the board.
Led by Atal, powered by Azmat, 🇦🇫 end amassing a mighty total.
Will Hong Kong, China respond in kind and get over the line?#AFGvHK#DPWorldAsiaCup2025#ACCpic.twitter.com/N4uahwpl7T— AsianCricketCouncil (@ACCMedia1) September 9, 2025
సెదిఖుల్లా అటల్ , ఓమర్జాయ్ ధనాధన్ బ్యాటింగ్
సెదిఖుల్లా అటల్ తర్వాత ఓమర్జాయ్ ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ లో దూకుడు తీసుకొచ్చాడు. ధనాధన్ బ్యాటింగ్ తో కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. తన 53 పరుగుల ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. ఓమర్జాయ్ హ్యాట్రిక్ సిక్సర్లతో దుమ్మురేపాడు.
⚠️ Spectators ⚠️
Azmatullah Omarzai unleashed his power game, tonking five massive 6️⃣s into the stands, in his whirlwind knock! 🌪️#AFGvHK#DPWorldAsiaCup2025#ACCpic.twitter.com/pxUhZ2EJRD— AsianCricketCouncil (@ACCMedia1) September 9, 2025
హాంకాంగ్ ముందు 189 పరుగుల టార్గెట్ ఉంచిన ఆఫ్ఘనిస్తాన్
20 ఓవర్లలో అఫ్గానిస్తాన్ జట్టు 189 పరుగులు సాధించింది. ఆరంభంలో తడబడినప్పటికీ సెదిఖుల్లా అటల్, ఓమర్జాయ్ జోడీ రాణించడంతో ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ జట్టు ముందు 190 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
When you get Gurbaz, you don’t just celebrate… you feel it 💪#AFGvHK#DPWorldAsiaCup2025#ACCpic.twitter.com/zw8J8pYG38
— AsianCricketCouncil (@ACCMedia1) September 9, 2025
ఆఫ్ఘనిస్తాన్ vs హాంకాంగ్ జట్లు
హాంకాంగ్ (ప్లేయింగ్ XI): జీషన్ అలీ (w), బాబర్ హయత్, అన్షుమన్ రాత్, కల్హన్ చల్లు, నిజాకత్ ఖాన్, ఐజాజ్ ఖాన్, కించిత్ షా, యాసిమ్ ముర్తాజా (c), ఆయుష్ శుక్లా, అతీఖ్ ఇక్బాల్, ఎహ్సాన్ ఖాన్
ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్ (w), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, కరీం జనత్, రషీద్ ఖాన్ (c), నూర్ అహ్మద్, AM గజన్‌ఫర్, ఫజల్‌హఖర్ ఫారూ
🚨 Playing XI 🚨
📄 Team sheets locked and loaded. Afghanistan and Hong Kong, China name a stellar line-up.
Who’ll stamp their authority in the opener?#AFGvHK#DPWorldAsiaCup2025#ACCpic.twitter.com/75CiaFpCjD— AsianCricketCouncil (@ACCMedia1) September 9, 2025