స్టార్ బౌలర్లు అవుట్.. సూపర్ 4లో పాకిస్తాన్ తో తలపడే భారత జట్టు ఇదే
India vs Pakistan : ఆసియా కప్ 2025 సూపర్ 4లో భారత్, పాకిస్తాన్ జట్లు మరోసారి తలపడున్నాయి. అయితే, ఈ కీలక మ్యాచ్ కు ముందు భారత జట్టులో మార్పులు జరుగుతున్నాయి. పాక్ తో తలపడే టీమిండియా వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆసియా కప్ 2025 సూపర్ 4లో భారత్ vs పాకిస్తాన్ ఫైట్
ఆసియా కప్ 2025 క్రికెట్ టోర్నమెంట్‌లో లీగ్ దశలో టీమిండియా జైత్రయాత్ర కొనసాగింది. మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన భారత్ అగ్రస్థానంలో నిలిచి సూపర్ 4 దశకు అర్హత సాధించింది. ఈ దశలో తన తొలి మ్యాచ్‌ను భారత జట్టు పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ కీలక పోరు ఆదివారం (21 సెప్టెంబర్) దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. సూపర్ 4లో భారత్ తన మిగతా మ్యాచ్‌లను సెప్టెంబర్ 24న బంగ్లాదేశ్‌తో, సెప్టెంబర్ 26న శ్రీలంకతో ఆడనుంది.
KNOW
స్పిన్‌కు అనుకూల దుబాయ్ పిచ్
దుబాయ్ పిచ్ స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని పిచ్ రిపోర్టులు పేర్కొంటున్నాయి. అందువల్ల భారత జట్టు పాకిస్తాన్ తో ఆడబోయే మ్యాచ్ లో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది. అలాగే, జట్టులో ఒక ఫాస్ట్ బౌలర్ కూడా ఉంటారు. ఈ కాంబినేషన్‌తో జట్టు బ్యాలెన్స్‌గా ఉంటుందని భారత జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
సంజూ శాంసన్ కు చోటు దక్కేనా?
ఒమన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో సంజూ శాంసన్ మూడో స్థానంలో బ్యాటింగ్ వచ్చాడు. సాధారణంగా ఈ ప్లేస్ లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఆర్డర్ లో ఉంటారు. అయితే, సూర్య తన స్థానాన్ని విడిచిపెట్టాడు. కానీ పాకిస్థాన్ వంటి కీలక జట్టుతో జరిగే మ్యాచ్ లో ఆ పరిస్థితి ఉండదని స్పష్టమైంది. టాప్ ఆర్డర్‌లో వికెట్ పడితేనే సంజూ శాంసన్ మూడో స్థానంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. లేకుంటే సూర్యకుమార్ తన స్థానంలోనే కొనసాగుతాడు.
అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాలు ఔట్
ఒమన్‌తో ఆడిన మ్యాచ్‌లో భాగమైన అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాలు పాక్ తో ఆడే భారత జట్టులో చోటు దక్కించుకునే అవకాశం లేదు. బదులుగా జస్ప్రిత్ బుమ్రా ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో తిరిగి జట్టులోకి వస్తున్నాడు. స్పిన్ విభాగంలో తమిళనాడు స్టార్ వరుణ్ చక్రవర్తి తిరిగి జట్టులోకి రాబోతున్నాడు. అతనితో పాటు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ లు భారత స్పిన్ విభాగాన్ని నడిపించనున్నారు.
పాకిస్తాన్ సూపర్ 4 మ్యాచ్ కోసం భారత్ ప్లేయింగ్ 11 అంచనా జట్టు
ఆసియా కప్ 2025 సూపర్ 4లో పాకిస్థాన్‌పై తలపడే మ్యాచ్‌కు భారత జట్టు అంచనా ప్లేయింగ్ 11 గమనిస్తే..
• ఓపెనర్లు: శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ
• బ్యాటర్లు : సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్
• ఆల్‌రౌండర్లు: హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్
• బౌలర్లు: జస్ప్రిత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
ఈ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్న భారత్, బ్యాటింగ్ బలంతో పాటు బౌలింగ్‌లోనూ సమతుల్యత సాధించనుంది. ప్రత్యేకంగా బుమ్రా తిరిగి రావడంతో జట్టుకు పేస్ విభాగంలో బలమైన ఆధిక్యం లభించనుంది.