- Home
- Sports
- Cricket
- ఆసియా కప్ 2025: అఫ్గానిస్తాన్ vs హాంకాంగ్ మధ్య తొలి మ్యాచ్.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలి?
ఆసియా కప్ 2025: అఫ్గానిస్తాన్ vs హాంకాంగ్ మధ్య తొలి మ్యాచ్.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలి?
Asia Cup 2025 : ఆసియా కప్ 2025 తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్-హాంకాంగ్ తలపడనున్నాయి. మ్యాచ్ టైమింగ్స్, వేదిక, లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ వివరాలు మీకోసం.

ఆసియా కప్ 2025 ఎప్పుడు ప్రారంభం అవుతుంది?
ఆసియా ఖండంలో అతిపెద్ద క్రికెట్ టోర్నమెంట్ అయిన ఆసియా కప్ 2025 యుఏఈలో మంగళవారం (సెప్టెంబర్ 9న) ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ అఫ్గానిస్తాన్, హాంకాంగ్ జట్ల మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ అబుదాబిలోని షేక్ జాయేద్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.
Tomorrow marks an exciting moment for Hong Kong, China as our men’s team starts their Asia Cup 2025 journey withe the first match against Afghanistan.
Tune in at 10:30pm HKT tomorrow watch the match live & exclusive in Hong Kong on:
- @Now TV – Cricket (Channel 674)
- @CricBuzz… pic.twitter.com/iEAJ8xL2er— Cricket Hong Kong, China (@CricketHK) September 8, 2025
ఆసియా కప్ తొలి మ్యాచ్ తేదీ, సమయం
ఆసియా కప్ 2025 తొలి మ్యాచ్ సెప్టెంబర్ 9న జరగనుంది. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ రాత్రి 8:00 గంటలకు మొదలవుతుంది. స్థానిక సమయం ప్రకారం సాయంత్రం 6:30కి ఆరంభమవుతుంది.
వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి?
ఆసియా కప్ 2025 తొలి మ్యాచ్ కు పెద్దగా అంతరాయం కలిగించే వాతావరణ పరిస్థితులు వుండవు. అబుదాబిలో వాతావరణం వేడిగా ఉండనుంది. గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ గా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొంత మబ్బులు కమ్మిన వాతావరణం కనిపించవచ్చు. కానీ, వర్షం పడే అవకాశం లేదని వాతావరణ విభాగం ప్రకటించింది.
ఆసియా కప్ 2025 లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ వివరాలు
• టీవీ ప్రసారం: భారత్‌లో అఫ్గానిస్తాన్ vs హాంకాంగ్ మ్యాచ్ Sony Sports Network టీవీ ఛానెల్‌లపై ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.
• లైవ్ స్ట్రీమింగ్: మ్యాచ్‌ను Sony Liv యాప్, వెబ్‌సైట్ ద్వారా లైవ్‌లో చూడవచ్చు. అయితే, స్ట్రీమింగ్ కోసం సోనీ లివ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.
The World’s eyes are on Asia’s fiercest rivalries 🌏🔥
Get ready for epic battles in #AsiaCup2025 🏏
Watch #DPWORLDASIACUP2025, LIVE on #SonyLIV & #SonySportsNetwork TV Channels 📺 pic.twitter.com/uDITBHRwuT— Sony LIV (@SonyLIV) September 8, 2025
ఆసియా కప్ 2025 తొలి మ్యాచ్: అఫ్గానిస్తాన్ vs హాంకాంగ్ జట్ల వివరాలు
అఫ్గానిస్తాన్ జట్టు:
రషీద్ ఖాన్ (కెప్టెన్), రెహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రాహీం జాద్రాన్, దర్వేశ్ రసూలీ, సదికుల్లా అట్ల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కరీమ్ జనత్, మహమ్మద్ నబీ, గుల్బదీన్ నయిబ్, షరాఫుద్దీన్ అష్రఫ్, మహమ్మద్ ఇషాక్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, అల్లాహ్ గజన్ఫర్, నూర్ అహ్మద్, ఫరీద్ మాలిక్, నవీన్ ఉల్ హక్, ఫజల్హక్ ఫరూకీ.
హాంకాంగ్ జట్టు:
యాసిమ్ ముర్తజా (కెప్టెన్), బాబర్ హయాత్, జీషాన్ అలీ, నియాజకత్ ఖాన్ మహమ్మద్, నస్రుల్లా రాణా, మార్టిన్ కోట్జీ, రథ్, కళ్హాన్ మార్క్, ఆయుష్ శుక్లా, మహమ్మద్ ఐజాజ్ ఖాన్, అతీక్ ఉర్ రెహ్మాన్ ఇక్బాల్, కించిత్ షా, అలీ హసన్, షాహిద్ వసీఫ్, గజన్ఫర్ మహమ్మద్, మహమ్మద్ వాహిద్, ఇహ్సాన్ ఖాన్.
ఈ మ్యాచ్‌తో ఆసియా కప్ 2025 ఆరంభం కానుండగా, భారత్ తన మొదటి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యుఏఈతో ఆడనుంది. ఆపై సెప్టెంబర్ 14న పాకిస్థాన్తో, సెప్టెంబర్ 19న ఒమన్తో తలపడనుంది.