Asia Cup 2023: రోహిత్ శర్మ డకౌట్... చెత్త రికార్డు క్రియేట్ చేసిన టీమిండియా కెప్టెన్...
ఆసియా కప్ 2023 టోర్నీ సూపర్ 4 రౌండ్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా, 17 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. వరుసగా మూడు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు చేసి, జోరు మీదున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కొత్త కుర్రాడు తంజీమ్ హసన్ షేక్ బౌలింగ్‌లో అనమోల్ హక్‌కి క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు..
అంతర్జాతీయ క్రికెట్‌లో వరుసగా 28 ఇన్నింగ్స్‌లు డబుల్ డిజిట్ స్కోర్లు చేస్తూ వచ్చిన రోహిత్ శర్మ, నేటి మ్యాచ్‌లో దాన్ని అందుకోలేకపోయాడు.
ఆసియా కప్ చరిత్రలో మూడు సార్లు డకౌట్ అయిన మొట్టమొదటి భారత ప్లేయర్‌గా చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు రోహిత్ శర్మ. ఇంతకుముందు భువనేశ్వర్ కుమార్, హార్ధిక్ పాండ్యా రెండేసి సార్లు డకౌట్ అయ్యారు..
ఆసియా కప్ చరిత్రలో డకౌట్ అయిన రెండో భారత కెప్టెన్‌గా నిలిచాడు రోహిత్ శర్మ. ఇంతకుముందు 1988 ఆసియా కప్ ఎడిషన్‌లో అప్పటి భారత కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ డకౌట్ అయ్యాడు..
అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మకు ఇది 29వ డకౌట్. టాపార్డర్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన నాలుగో భారత ప్లేయర్‌గా నిలిచాడు రోహిత్ శర్మ. సచిన్ టెండూల్కర్ 34, విరాట్ కోహ్లీ 33, వీరేంద్ర సెహ్వాగ్ 31 సార్లు డకౌట్ అయి, రోహిత్ కంటే ముందున్నారు..
అలాగే ఆసియా కప్‌లో రెండు సార్లు డకౌట్ అయిన భారత ఓపెనర్ కూడా రోహిత్ శర్మనే. ఇంతకుముందు ఏ భారత ఓపెనర్ కూడా రెండు సార్లు డకౌట్ కాలేదు..
Tilak Varma Clean Bowled vs Bangladesh
విరాట్ కోహ్లీ స్థానంలో తుది జట్టులో చోటు దక్కించుకున్న తెలుగుకుర్రాడు తిలక్ వర్మ, ఆరంగ్రేటం వన్డేలో ఆకట్టుకోలేకపోయాడు. 9 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసిన తిలక్ వర్మ, తంజీమ్ హసన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు..