Asia Cup 2023: శుబ్‌మన్ గిల్ అవుట్! రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ... 10 వేల క్లబ్‌లో హిట్ మ్యాన్...
ఆసియా కప్ 2023 టోర్నీలో టీమిండియా ప్లేయర్లు రికార్డుల మోత మోగిస్తున్నారు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 13 వేల వన్డే పరుగుల మైలురాయి అందుకుంటే, శ్రీలంకతో మ్యాచ్‌లో రోహిత్ శర్మ 10 వేల క్లబ్‌లో చేరాడు..
విరాట్ కోహ్లీ 205 ఇన్నింగ్స్‌ల్లో వన్డేల్లో 10 వేల పరుగులు మైలురాయి అందుకున్నాడు. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన ప్లేయర్‌గా టాప్‌లో ఉన్నాడు విరాట్ కోహ్లీ. 241 ఇన్నింగ్స్‌ల్లో 10 వేల వన్డే పరుగులు అందుకున్న రోహిత్ శర్మ, విరాట్ తర్వాతి స్థానంలో నిలిచాడు..
సచిన్ టెండూల్కర్ 259 ఇన్నింగ్స్‌ల్లో 10 వేల వన్డే పరుగులు అందుకుంటే, సౌరవ్ గంగూలీ 263 ఇన్నింగ్స్‌ల్లో 10 వేల పరుగులు చేశాడు. అత్యంత వేగంగా 10 వేల వన్డే పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో టాప్ 4లో భారత బ్యాటర్లే ఉన్నారు..
Rohit Sharma
మొదటి 82 ఇన్నింగ్స్‌ల్లో 2 వేల వన్డే పరుగులు మాత్రమే చేసిన రోహిత్ శర్మ, ఆ తర్వాత 159 ఇన్నింగ్స్‌ల్లో 8 వేల పరుగులు చేశాడు. ఓపెనర్‌గా మారిన తర్వాత రోహిత్ ఆటతీరు పూర్తిగా మారిపోయింది..
సచిన్ టెండూల్కర్ 18426, విరాట్ కోహ్లీ 13024, సౌరవ్ గంగూలీ 11363, రాహుల్ ద్రావిడ్ 10889, మహేంద్ర సింగ్ ధోనీ 10773 వన్డే పరుగులు చేసి, రోహిత్ శర్మ కంటే ముందున్నారు..
Rohit Sharma_Shubman Gill
44 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో వన్డేల్లో 51వ హాఫ్ సెంచరీ అందుకున్నాడు రోహిత్ శర్మ. 25 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్‌ని దునిత్ వెల్లలాగే అవుట్ చేశాడు. 80 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది భారత జట్టు..