ఆ మోచేతి పట్టీ తీసి బౌలింగ్ చెయ్! జస్ప్రిత్ బుమ్రాతో పాక్ ఓపెనర్ ఇమామ్... పర్ఫెక్ట్ రిప్లైతో..
జెంటిల్మెన్ గేమ్ క్రికెట్‌లో బ్యాటర్లకు చాలా సౌకర్యాలు, సదుపాయాలు ఉంటాయి. పవర్ ప్లే, ఫ్రీ హిట్ ఇలాంటి నిబంధనలు బ్యాటర్లకు అనుకూలంగా తీసుకువచ్చినవే. తాజాగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లో జరిగిన ఓ సంఘటన.. సోషల్ మీడియాలో చర్చకు కారణమైంది.
Jasprit Bumrah
భారత ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌కి వచ్చాడు. ఫకార్ జమాన్‌కి వేసిన మొదటి ఓవర్‌లో ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చిన 5 వైడ్స్ తప్ప పరుగులేమీ ఇవ్వలేదు బుమ్రా..
అయితే ఆ తర్వాతి ఓవర్‌లో బుమ్రాని ఎదుర్కొన్న పాక్ ఓపెనర్ ఇమామ్ వుల్ హక్, మొదటి బంతి తర్వాత చేతికి ఉన్న ఎల్బో స్ట్రాప్స్ తీయాల్సిందిగా బౌలర్‌ని కోరాడు. దీంతో తన మోచేతులకు ఉన్న స్ట్రాప్స్‌ని తీసి, అంపైర్‌కి అందించిన జస్ప్రిత్ బుమ్రా.. ఆ ఓవర్‌ని కొనసాగించాడు.
ఆ ఓవర్‌లో 3 పరుగులు రాబట్టిన ఇమామ్ వుల్ హక్.. బుమ్రా వేసిన నాలుగో ఓవర్‌లో రెండో బంతికి అవుట్ అయ్యాడు. 18 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసిన ఇమామ్ వుల్ హక్, బుమ్రా బౌలింగ్‌లో స్లిప్స్‌లో శుబ్‌మన్ గిల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.. ఆ ఓవర్‌లో పరుగులేమీ ఇవ్వకుండా వికెట్ మెయిడిన్ నమోదు చేశాడు జస్ప్రిత్ బుమ్రా..
Jasprit Bumrah
ఏడాది తర్వాత రీఎంట్రీ ఇచ్చిన జస్ప్రిత్ బుమ్రా, కమ్‌బ్యాక్ తర్వాత వన్డేల్లో తీసిన మొట్టమొదటి వికెట్ ఇదే. ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆకట్టుకున్నా, అది పసికూన జట్టు కావడంతో బుమ్రా రేంజ్‌కి ఆ పర్ఫామెన్స్ లెక్కలోకి రాదు.
జెర్సీ కాకుండా బౌలర్ ధరించిన ఇతరత్రా వస్తువులు ఇబ్బందిగా అనిపిస్తున్నాయనిపిస్తే, అంపైర్‌కి ఫిర్యాదు చేయవచ్చు. 1993లో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ డీన్ జోన్స్, వెస్టిండీస్ మాజీ లెజెండరీ బౌలర్ కర్ట్‌లీ ఆంబ్రోస్ వేసుకున్న రిస్ట్ బ్యాండ్‌ని తొలగించాల్సిందిగా కోరాడు.
ఆ మ్యాచ్‌లో అంపైర్లు కూడా జోన్స్ కోరికను పరిగణనలోకి తీసుకోవడంతో అయిష్టంగానే తన రిస్ట్ బ్యాండ్‌ని తొలగించాడు కర్ట్‌లీ ఆంబ్రోస్. ఈ మ్యాచ్‌లో ఆంబ్రోస్ 5 వికెట్లు తీసి, వెస్టిండీస్‌కి విజయాన్ని అందించడం విశేషం.