- Home
- Sports
- Cricket
- అతనికి బుర్ర బానే పనిచేస్తోందా? ఇంగ్లాండ్‌లో ఆసియా కప్ పెడతారా? రమీజ్ రాజా కామెంట్స్...
అతనికి బుర్ర బానే పనిచేస్తోందా? ఇంగ్లాండ్‌లో ఆసియా కప్ పెడతారా? రమీజ్ రాజా కామెంట్స్...
ఆసియా కప్ 2022 టోర్నీ ఆరంభానికి ముందే ఆసియా కప్ 2023 టోర్నీ గురించి రచ్చ మొదలైంది. షెడ్యూల్ ప్రకారం మరో 3 నెలల్లో ఆసియా కప్ 2023 టోర్నీ జరగాల్సి ఉన్నా, ఇంకా ఎక్కడ జరుగుతుంది? ఏయే టీమ్స్ ఆడతాయనే విషయంలో క్లారిటీ రాలేదు...

ఆసియా కప్ 2022 టోర్నీ సమయంలో పాక్ క్రికెట్ బోర్డుకి అధ్యక్షుడిగా ఉన్న రమీజ్ రాజా, టీమిండియా, పాక్‌లో అడుగుపెట్టకపోతే, వన్డే వరల్డ్ కప్‌లో ఆడబోమని కామెంట్ చేశాడు. ఈ కామెంట్ల కారణంగా పీసీబీ ఛైర్మెన్ పొజిషన్ నుంచి తప్పుకున్నాడు...
అతని స్థానంలో పీసీబీ ఛైర్మెన్‌గా బాధ్యతలు అందుకున్న నజం సేథీ కూడా ఆసియా కప్ 2023 టోర్నీ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. తొలుత ఇండియా ఆడే మ్యాచులను యూఏఈలో, మిగిలిన మ్యాచులను పాకిస్తాన్‌లో నిర్వహించాలని అనుకున్నారు...
అయితే ఇలా రెండు వేర్వేరు దేశాల్లో ఆసియా కప్ 2023 టోర్నీ ఆడేందుకు శ్రీలంక, బంగ్లాదేశ్ బోర్డులు నిరాకరించాయి. దీంతో ఇంగ్లాండ్‌లో ఆసియా కప్ 2023 నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని పీసీబీ ఛైర్మెన్ నజం సేథీ కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించాడు రమీజ్ రాజా...
‘ఆసియా కప్ టోర్నీని లార్డ్స్‌లో నిర్వహిస్తామని పీసీబీ ఛైర్మెన్ చెప్పడం చూసి నేను షాక్ అయ్యా. అతని మానసిక స్థితి సరిగానే ఉందా? లేదా? ఆసియా కప్ 2023 టోర్నీని నిర్వహించేది ఎందుకు? ఐసీసీ వన్డే వరల్డ్ కప్ టోర్నీకి ప్రాక్టీస్‌గానే కదా...
ఇండియాలో వన్డే వరల్డ్ కప్ జరగబోతుంటే, అక్కడి పిచ్‌లకు ఏ మాత్రం సంబంధం లేని లండన్‌లో ఆసియా కప్ 2023 టోర్నీ ఎలా పెడతారు? ఉప ఖండంలోనే టోర్నీ జరిగి తీరాలి...
Image credit: Getty
మిస్టర్ ఛైర్మెన్ చేసిన మరో కామెంట్ కూడా నాకు కోపాన్ని తెప్పించింది. ట్యాక్సులు తప్పించుకోవడానికి దుబాయ్‌లో పాక్ సూపర్ లీగ్ సీజన్ 9ని నిర్వహిస్తామని అన్నారు. పాకిస్తాన్ సేఫ్‌గా ఉంది, ఆసియా కప్ ఇక్కడే ఆడండి అని టీమిండియాకి చెబుతూ పీఎస్‌ఎల్‌ని ఎక్కడో ఎలా పెడతారు...
ఆ లాజిక్ ఏంటో నాకైతే అర్థం కావడం లేదు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌ని పాక్‌కి తీసుకురావడానికి ఎన్నో ఏళ్లు కష్టపడ్డాను. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాను..
Babar Azam PSL
ఆ లీగ్ వల్లే దశాబ్దాల తర్వాత పాక్‌లో క్రికెట్ ఆడేందుకు మిగిలిన దేశాలు వచ్చాయి. ఆ విషయాన్ని ఎలా మరిచిపోతారు...’ అంటూ కామెంట్ చేశాడు పీసీబీ మాజీ ఛైర్మెన్ రమీజ్ రాజా..