అతనికి మాత్రం వికెట్లు ఇవ్వకండి.. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌పై హర్భజన్ సింగ్ కామెంట్...
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ నుంచి టీమిండియాకి ఛాలెంజింగ్ బౌలర్‌గా మారాడు షాహీన్ షా ఆఫ్రిదీ. ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మను గోల్డెన్ డకౌట్ చేసిన షాహీన్ ఆఫ్రిదీ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ వికెట్లు తీశాడు. ఆసియా కప్ 2023 టోర్నీలోనూ టీమిండియా టాపార్డర్‌ని దెబ్బ తీశాడు షాహీన్..
Shaheen Shah Afridi
ఆసియా కప్ 2023 గ్రూప్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ కూడా షాహీన్ షా ఆఫ్రిదీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యారు. రోహిత్ వికెట్ల ముందు దొరికిపోగా విరాట్ ఆడిన షాట్ బ్యాటు ఎడ్జ్‌ని తాకి, వికెట్లపైకి వెళ్లింది...
Shaheen Afridi-Virat Kohli
ఒకే వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను బౌల్డ్ చేసిన మొట్టమొదటి పాకిస్తాన్ బౌలర్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు షాహీన్ షా ఆఫ్రిదీ..
సూపర్ 4 మ్యాచ్‌లో మాత్రం షాహీన్ షా ఆఫ్రిదీకి వికెట్లు ఇవ్వకూడదని కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్..
Shaheen Afridi
‘పాకిస్తాన్ బౌలింగ్ యూనిట్‌కి షాహీన్ ఆఫ్రిదీ మెయిన్. అతనికి వికెట్లు ఇవ్వకుండా చూసుకుంటే చాలు, మిగిలిన బౌలర్లపై ప్రెషర్ పెంచవచ్చు. బౌలర్లపై ప్రెషర్ పెడితే, వరల్డ్ క్లాస్ బౌలింగ్ అటాక్ కూడా వీగిపోతుంది..
టీమిండియా తొలుత బ్యాటింగ్ చేస్తోంది కాబట్టి కచ్ఛితంగా 300 పరుగులు దాటాలి. రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ కలిసి 15 ఓవర్లు ఆడితే చాలు, ఆ తర్వాత వచ్చే బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తారు.
పాకిస్తాన్ పేసర్లను ఎదుర్కొనేటప్పుడు వాళ్ల ఇగోని పక్కనబెట్టి ఆడితే, ఈజీగా పరుగులు చేయొచ్చు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్..