WPL 2025: 8 సిక్సర్లు.. చరిత్ర సృష్టించిన ఆష్లీ గార్డనర్
Royal Challengers Bengaluru vs Gujarat Giants: మహిళా ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025 తొలి మ్యాచ్ లో గుజరాత్, బెంగళూరు జట్లు పరుగుల వరద పారించాయి. ఈ క్రమంలోనే ఆష్లే గార్డనర్ సిక్సర్ల మోత మోగిస్తూ మహిళా ఐపీఎల్ లో చరిత్ర సృష్టించారు.

Royal Challengers Bengaluru vs Gujarat Giants: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ ఆష్లీ గార్డనర్ సునామీ ఇన్నింగ్స్ తో అదరగొట్టారు. కేవలం 37 బంతుల్లో 79 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఈ క్రమంలోనే మహిళా ప్రీమియర్ లీగ్ లో చరిత్ర సృష్టించింది.
Ashleigh Gardner
ఆస్ట్రేలియన్ ప్లేయర్ ఆష్లీ గార్డనర్ క్రీజులోకి అడుగుపెట్టినప్పటి నుంచే ఆర్సీబీపై అటాక్ మొదలుపెట్టింది. బ్యాటర్లకు అనుకూలిస్తున్న పిచ్ ను సద్వినియోగం చేసుకుని సునామీ ఇన్నింగ్స్ ఆడారు. ఓపెనర్ బెత్ మూనీ 42 బంతుల్లో 56 పరుగులు చేసి జట్టుకు మంచి సహకారం అందించారు. ఆ తర్వాత వచ్చిన ఆష్లీ గార్డనర్ సిక్సర్ల మోత మోగించారు. స్టేడియం అన్ని వైపులా భారీ సిక్సర్లు కొట్టారు. ఆర్సీబీ బౌలింగ్ ను చెడుగుడు ఆడుకున్నారు.
79 పరుగుల తన ఇన్నింగ్స్ లో ఆష్లీ గార్డనర్ ఏకంగా 8 సిక్సర్లు బాదారు. ఇది WPL చరిత్రలో ఒక ఇన్నింగ్స్ లో ఒక క్రికెటర్ చేసిన అత్యధిక సిక్సర్లు. న్యూజిలాండ్ అంతర్జాతీయ క్రీడాకారిణి సోఫీ డివైన్ 2023 ఎడిషన్‌లో గుజరాత్‌పై అదే సంఖ్యలో సిక్సర్లు కొట్టింది. భారత బ్యాటర్ షఫాలి వర్మ ఒక ఇన్నింగ్స్‌లో ఐదు సిక్సర్లతో మూడవ స్థానంలో ఉంది.
WPLలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్లు వీరే:
1. ఆష్లీ గార్డనర్ 79 పరుగులు- 8 సిక్సర్లు
2. సోఫీ డివైన్ 99 పరుగులు - 8 సిక్సర్లు
3. షఫాలీ వర్మ 76 పరుగులు - 5 సిక్సర్లు
4. ఎలిస్సే పెర్రీ 67 పరుగులు - 5 సిక్సర్లు
5. ఆలిస్ కాప్సే 38 పరుగులు - 5 సిక్సర్లు
6. షఫాలీ వర్మ 71 పరుగులు - 5 సిక్సర్లు
7. హర్మన్‌ప్రీత్ కౌర్ 95 పరుగులు - 5 సిక్సర్లు
Image credit: PTI
ఈ మ్యాచ్ లో గుజరాత్ 41/2 పరుగులతో ఉన్న సమయంలో ఆష్లీ గార్డనర్ క్రీజులోకి వచ్చింది. ఆమె మొదట్లో స్థిరపడటానికి కొంత సమయం తీసుకుంది. మూనీ ఔట్ అయిన తర్వాత ఆష్లీ గార్డనర్ తన బ్యాటింగ్ విధ్వంసం చూపించింది. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేసింది. గ్రౌండ్ అన్ని వైపుల సిక్సర్ల మోత మోగించింది.
ఆష్లీ గార్డనర్ అద్భుతమైన ఆటతీరుతో గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో 201/5 పరుగులు చేసింది. ఇది టోర్నమెంట్‌లో వారి ఉమ్మడి అత్యధిక స్కోరు. 2023 ఎడిషన్ టోర్నమెంట్‌లో వారు RCBపై 201/7 పరుగులు చేశారు. ఆ మ్యాచ్‌లో, సోఫీ డంక్లీ, హర్లీన్ డియోల్ చెరో హాఫ్ సెంచరీ కొట్టారు.
Ashleigh Gardner
రిచా ఘోస్ దెబ్బకు గుజరాత్ కు తప్పని ఓటమి
గుజరాత్ భారీ స్కోర్ చేసినప్పటికీ బౌలింగ్ పదును లేకపోవడం, ఫీల్డింగ్ లో తప్పుడు, కీలకమైన సమయంలో క్యాచ్ లను వదిలిపెట్టడంతో మ్యాచ్ ను కోల్పోయింది. ఎల్లీస్ పెర్రీ ధనాధన్ బ్యాటింగ్ తో 34 బంతుల్లో 57 పరుగుల ఇన్నింగ్స్ ఆడారు. ఇక రిచాఘోష్ సునామీ బ్యాటింగ్ తో అదరగొడుతూ చివరి వరకు క్రీజులో ఉండి ఆర్సీబీకి విజయాన్ని అందించారు. రిచా తన 64 పరుగుల ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టారు.