MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • అనిల్ కుంబ్లేని అవమానించాడుగా, అనుభవిస్తున్నాడు... విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ రిటైర్మెంట్‌పై...

అనిల్ కుంబ్లేని అవమానించాడుగా, అనుభవిస్తున్నాడు... విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ రిటైర్మెంట్‌పై...

టీమిండియాలోనే కాదు, వరల్డ్ క్రికెట్‌లోనే తిరుగులేని స్టార్‌గా ఎదిగాడు విరాట్ కోహ్లీ. టీమిండియా కంటే విరాట్ కోహ్లీ స్టార్ రేంజ్ వెయ్యి రెట్లు ఎక్కువగా పెరిగింది. అలాంటి బ్రాండ్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడంలో సక్సెస్ అయ్యింది బీసీసీఐ...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jan 16 2022, 01:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని విరాట్ కోహ్లీ నిర్ణయం తీసుకున్న తర్వాత అతని నుంచి బలవంతంగా వన్డే కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్న బీసీసీఐ, పక్కా ప్లాన్‌తో టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా దూరం చేసింది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

టీమిండియాకి అత్యంత విజయవంతమైన టెస్టు సారథిగా ఉన్న విరాట్ కోహ్లీని ఇలా కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని జీర్ణించుకోలేకపోతున్న అభిమానులు... ‘Shame on BCCI’, ‘BCCI politics’ అని హ్యాష్ ట్యాగ్‌లతో తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు...

311

టీమిండియా తర్వాతి సారథిగా ప్రచారంలో ఉన్న రోహిత్ శర్మతో పాటు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, బీసీసీఐ సెక్రటరి జై షాలపై కూడా ఈ రకమైన విమర్శల వస్తున్నాయి...

411

అయితే మరో వర్గం మాత్రం ‘అనిల్ కుంబ్లే’ హ్యాష్‌ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తోంది. 2016 నుంచి 2017 వరకూ టీమిండియా హెడ్‌ కోచ్‌గా వ్యవహరించాడు భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే...

511

అయితే కోచ్‌గా ఉన్న సమయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో తలెత్తిన విభేదాల కారణంగా అర్ధాంతరంగా ఆ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది అనిల్ కుంబ్లే...

611

అనిల్ కుంబ్లేని హెడ్ కోచ్‌గా తప్పించకపోతే, తాను కెప్టెన్‌గా కొనసాగనని బీసీసీఐ అధికారులను బెదిరించాడని వార్తలు వచ్చాయి. 

711

కుంబ్లే మీద కోపంతోనే 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత జట్టు కావాలని ఓడిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి...

811

అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లీ వివాదం రేగిన సమయంలో క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ కౌన్సిల్‌లో సభ్యుడిగా ఉన్నాడు ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ...

911

ఆ సమయంలో విరాట్ కోహ్లీకి సద్దిచెప్పేందుకు గంగూలీ, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ (సీఓఏ సభ్యులు) ఎంత ప్రయత్నించినా, అతను వినిపించుకోలేదు... దానికి ప్రతిఫలమే 4 ఏళ్ల తర్వాత విరాట్ కోహ్లీ అనుభవిస్తున్నాడని అంటున్నారు కుంబ్లే ఫ్యాన్స్...

1011

తన అహాన్ని దెబ్బతీసిన విరాట్ డామినేషన్‌కి చెక్ పెట్టేందుకు  సరైన సమయం కోసం ఎదురుచూసిన సౌరవ్ గంగూలీ, ఇప్పుడు అన్ని విధాలుగా అతన్ని కార్నర్ చేసి ప్రతీకారం తీర్చుకుంటున్నాడని అంటున్నారు దాదా అభిమానులు...

1111

టీమిండియా తరుపున అత్యధిక వికెట్లు తీసిన లెజెండరీ క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనిల్ కుంబ్లేకి విరాట్ కోహ్లీ చేసిన అవమానాలతో పోలిస్తే, ఇప్పుడు అతనికి జరిగిన పరాభవం తక్కువేనని అంటున్నారు కొందరు నెటిజన్లు...

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 Cricket Centuries: టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్ 7 బ్యాటర్లు ఎవరో తెలుసా?
Recommended image2
Hardik Pandya: అఫ్గానిస్తాన్‌తో T20I సిరీస్‌కు హార్దిక్ పాండ్యా ఎందుకు ఎంపిక కాలేదు?
Recommended image3
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved