MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Aniket Verma : చేసింది 36 పరుగులే కానీ కొట్టింది 6,6,6,6,6... ఎవరీ అనికేత్ వర్మ?

Aniket Verma : చేసింది 36 పరుగులే కానీ కొట్టింది 6,6,6,6,6... ఎవరీ అనికేత్ వర్మ?

సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయి ఉండవచ్చు. కానీ ఓ యువకెరటం మాత్రం వెలుగులోకి వచ్చాడు. కేవలం 36 పరుగులే చేసాడు... అందులో ఐదు సిక్సర్లున్నాయి. దీన్నిబట్టే అతడి హిట్టింగ్ ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకు ఆ యువరకెరటం ఎవరు?

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 28 2025, 12:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
Aniket Verma

Aniket Verma

Aniket Verma : సన్ రైజర్స్ హైదరాబాద్ అనుకున్న స్థాయిలో ఆడలేదు... లక్నో సూపర్  జాయింట్స్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసిందనే చెప్పాలి. సొంత మైదానం ఉప్పల్ లో హైదరాబాద్ టీం తడబడింది... కానీ ఓ యువకెరటం మాత్రం సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. అతడే అనికేత్ వర్మ. డొమెస్టిక్ క్రికెట్ లో సూపర్ క్రికెట్ ఆడిన ఈ యువకుడు ఐపిఎల్ లోనూ రెచ్చిపోతున్నాడు. ఓవైపు వికెట్లు పడుతున్నవేళ అనికేత్ కేవలం 13 బంతుల్లో 36 పరుగులతో చిన్నసైజు సునామీ సృష్టించాడు.

లక్నో బౌలర్ రవి బిష్ణోయ్ ను అనికేత్ ఓ ఆటాడుకున్నాడు.  అతడి బౌలింగ్ లోనే మూడు భారీ సిక్సర్లు బాదాడు.  ఆ తర్వాత దిగ్వేష్ ను రెండు సిక్సర్లు బాదాడు. ఇలా అనికేత్ సాధించిన 36 పరుగుల్లో 30 కేవలం సిక్సర్ల ద్వారా వచ్చినవే. ఇలా క్రీజులో ఉన్నంతసేపు ఆరెంజ్ ఆర్మీ అభిమానులను అలరించాడు అనికేత్. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
Aniket Verma

Aniket Verma

ఎవరీ అనికేత్ : 
 
సన్ రైజర్స్ హైదరాబాద్ టీం లో చేరిన యువకెరటం ఈ అనికేత్. డొమెస్టిక్ క్రికెట్ లో మంచి హిట్టర్ గా గుర్తింపుపొందిన అనికేత్ వర్మ ఎస్ఆర్‌హెచ్ లో చేరడంలో మరింత బలం పెరిగింది. ఆరెంజ్ ఆర్మీ సొంత గ్రౌండ్ ఉప్పల్ లోనే అనికేత్ ఐపిఎల్ లో సత్తా చాటాడు. మొదటి మ్యాచ్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఇతడు రెండో మ్యాచ్ లో మాత్రం సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు.  

ఉత్తర ప్రదేశ్ కు చెందిన అనికేత్ మంచి ఆల్ రౌండర్.  మంచి హిట్టర్ మాత్రమే కాదు రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ కూడా. అగ్రెసివ్ గా బ్యాటింగ్ చేసే ఇతడు టీ20 లకు సరిగ్గా సరిపోతాడు... మరీముఖ్యంగా ఐపిఎల్ లాంటి  లీగ్స్ లో సత్తాచాటే దమ్మున్న ఆటగాడు. హిట్టర్లతో నిండిన హైదరాబాద్ టీంలో మరో హిట్టర్ చేరాడు. 

డొమెస్టిక్ క్రికెట్ లో మధ్య ప్రదేశ్ తరపున ఆడాడు అనికేత్. అండర్ 23 టోర్నమెంట్ లో అద్భుత సెంచరీతో ఇతడి ట్యాలెంట్ బైటపడింది. ఆ తర్వాత ఆలిండియా బుచ్చిబాబు టోర్నమెంట్ లో మరో సెంచరీ సాధించాడు. ఇలా అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శనతో అదరగొట్టిన అనికేత్ ను సన్ రైజర్స్ సొంతం చేసుకుంది. ఈ సీజన్ లో అతడిని బరిలోకి దింపుతోంది... టీం మేనేజ్మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అతడు అద్భుతంగా ఆడుతున్నాడు. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs ENG: వైభవ్ సూర్యవంశీ గురించి నాకు తెలియదు.. శ్రేయాస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Team India: వరల్డ్ కప్ పోయింది.. ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ కొట్టాల్సిందే.. ఐదుగురు కొత్త ప్లేయర్లకు బంపర్ ఛాన్స్ !
Recommended image3
Ben Stokes: సడన్ షాక్ ఇచ్చిన ఇంగ్లండ్ కెప్టెన్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు బెన్ స్టోక్స్ సడన్ రిటైర్మెంట్ ఎందుకిచ్చాడు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved