MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఎస్ఆర్‌హెచ్ లో పాకెట్ సైజ్ డైనమైట్స్ ... వీరు విజృంభించారో రచ్చరచ్చే

ఎస్ఆర్‌హెచ్ లో పాకెట్ సైజ్ డైనమైట్స్ ... వీరు విజృంభించారో రచ్చరచ్చే

Indian Premier League 2025 : సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఇప్పటికే హెడ్, క్లాసేన్, ఇషాన్, అభిషేక్ వంటి హిట్టర్లున్నారు. ఇప్పుడు మరో ఇద్దరు పాకెట్ సైజ్ డైనమైట్స్ ఆ టీంలో చేరారు. ఆ యువ కెరటాలెవరో తెలుసా? 

2 Min read
Author : Arun Kumar P
| Updated : Mar 26 2025, 07:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
Aniket Verma

Aniket Verma

అనికేత్ వర్మ : సన్ రైజర్స్ హైదరాబాద్ టీం లో మరో యువకెరటం చేరింది. డొమెస్టిక్ క్రికెట్ లో మంచి హిట్టర్ గా గుర్తింపుపొందిన అనికేత్ వర్మ ఎస్ఆర్‌హెచ్ లో చేరడంలో మరింత బలం పెరిగింది. ఆరెంజ్ ఆర్మీ సొంత గ్రౌండ్ ఉప్పల్ లోనే అనికేత్ మొదటి ఐపిఎల్ మ్యాచ్ ఆడాడు.  

ఉత్తర ప్రదేశ్ కు చెందిన అనికేత్ మంచి ఆల్ రౌండర్.  మంచి హిట్టర్ మాత్రమే కాదు రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ కూడా. అగ్రెసివ్ గా బ్యాటింగ్ చేసే ఇతడు టీ20 లకు సరిగ్గా సరిపోతాడు... మరీముఖ్యంగా ఐపిఎల్ లాంటి  లీగ్స్ లో సత్తాచాటే దమ్మున్న ఆటగాడు. హిట్టర్లతో నిండిన హైదరాబాద్ టీంలో మరో హిట్టర్ చేరాడు. 

డొమెస్టిక్ క్రికెట్ లో మధ్య ప్రదేశ్ తరపున ఆడాడు అనికేత్. అండర్ 23 టోర్నమెంట్ లో అద్భుత సెంచరీతో ఇతడి ట్యాలెంట్ బైటపడింది. ఆ తర్వాత ఆలిండియా బుచ్చిబాబు టోర్నమెంట్ లో మరో సెంచరీ సాధించాడు. ఇలా అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శనతో అదరగొట్టిన అనికేత్ ను సన్ రైజర్స్ సొంతం చేసుకుంది. ఈ సీజన్ లో అతడిని బరిలోకి దింపుతోంది... టీం మేనేజ్మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ఆడతాడేమో చూడాలి.    
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
Abhinav Manohar

Abhinav Manohar

అభినవ్ మనోహర్ : సన్ రైజర్స్ హైదరాబాద్ లోని మరో ఆల్ రౌండర్ అభినవ్ మనోహర్. ఇతడు దేశవాళి క్రికెట్ లో విధ్వంసకర బ్యాట్ మెన్ గా గుర్తింపు పొందాడు.  ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో ఇతడు కేవలం 42 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 79 పరుగుల బాదాడు. ఇలా ధనాధన్ బ్యాటింగ్ తో మ్యాచ్ ను ములుపుతిప్పగల సత్తా కలిగిన ఆటగాడు అభినవ్. 

ఇతడు ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు... ఇది సన్ రైజర్స్ హైదరాబాద్ కు కలిసివచ్చే అంశం. అభినవ్ విధ్వంసం గురించి తెలిసిన ఎస్ఆర్‌హెచ్ మేనేజ్మెంట్ తొలి మ్యాచ్ లో అవకాశం ఇచ్చింది. ఈ మ్యాచ్ డకౌట్ అయ్యాడని చింతిచాల్సిన అవసరం లేదు... తనదైన రోజు ఆకాశమే హద్దుగా చెలరేగే సత్తా కలిగిన ఆటగాడు అభినవ్.  

హిట్టర్లలో కూడిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో అభినవ్ రూపంలో మరో మాస్ బ్యాట్ మెన్ దొరికాడు. ఇతడు ఆట మరో హెడ్,  అభిషేక్ వర్మ, క్లాసేన్ లను పోలివుంటుంది. వారి మాదిరిగే ఇతడు కూడా ఫార్మ్ అందుకుని చెలరేగితే ప్రత్యర్థులకు ఇక దబిడిదిబిడే. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup : విండీస్ పై సూపర్ విక్టరీ.. ఇండియా ఉమెన్స్ టీంను గెలిపించిన టాప్ అంశాలివే
Recommended image2
IND vs AFG Test Match : టీమిండియా దెబ్బకు అప్ఘాన్ ఆగమాగం.. గిల్ సేన గెలుపు వెనకున్న టాప్ 5 రీజన్స్ ఇవే
Recommended image3
SKY: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్ బై? సోషల్ మీడియాలో పోస్టులన్నీ డిలీట్.. ఏం జరుగుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved