- Home
- Sports
- Cricket
- వీవ్ రిచర్డ్స్ మళ్లీ పుట్టినట్టే అనిపించింది... ఆండ్రూ సైమండ్స్‌పై షేన్ వాట్సన్ కామెంట్...
వీవ్ రిచర్డ్స్ మళ్లీ పుట్టినట్టే అనిపించింది... ఆండ్రూ సైమండ్స్‌పై షేన్ వాట్సన్ కామెంట్...
క్రికెట్ ఆస్ట్రేలియా ఈ ఏడాది ఆరంభంలోనే ఇద్దరు దిగ్గజాలను కోల్పోయిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్, థాయిలాండ్‌లో గుండెపోటుతో ప్రాణాలు విడచగా, మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్... క్వీన్‌లాండ్స్‌లో జరిగిన కారు ప్రమాదంలో తుది శ్వాస విడిచాడు. తాజాగా ఆండ్రూ సైమండ్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టాడు అతని సహచర ఆటగాడు షేన్ వాట్సన్...

Andrew symonds
2003, 2007 ఐసీసీ వన్డే వరల్డ్ కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆండ్రూ సైమండ్స్, ఆస్ట్రేలియాకి మూడు ఫార్మాట్లలోనూ కీలక ప్లేయర్‌గా ఉండేవాడు.. అతనితో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్న షేన్ వాట్సన్ కొన్ని కామెంట్లు చేశాడు...
‘ఆండ్రూ సైమండ్స్‌లో ఉన్న టీమ్‌తో ఆడితే బుల్లెట్ ప్రూఫ్ వేసుకుని ఆడుతున్నట్టే ఉండేది. అతను టీమ్‌లో ఉంటే చాలు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా మ్యాచ్‌ని మలుపు తిప్పగలడు...
ఆండ్రూ సైమండ్స్‌తో బ్యాటింగ్ చేయడం చాలా స్పెషల్. ఇప్పటికీ అతను లేడనే నిజాన్ని నమ్మాలని లేదు. నేను ఇప్పటికీ పాత మ్యాచుల వీడియోలు చూసినప్పుడు, సైమండ్స్ బ్యాటింగ్ చూసి ఆశ్చర్యపోయేవాడిని...
Andrew Symonds
అతను చాలా చక్కని ప్లేయర్. ఓ అసాధారణ ఆటగాడు. బెస్ట్ టీమ్ మేట్... సైమండ్స్ మంచి క్రికెటర్ మాత్రమే కాదు, ఎంతో మంచి తండ్రి కూడా. అతని ఇద్దరు పిల్లల గురుంచి నాకు బెంగగా ఉంది...
ఆండ్రూ సైమండ్స్ ఆడుతుంటే వీవ్ రిచర్డ్స్ మళ్లీ పుట్టి ఆడుతున్నాడా? అనిపించేది. నేను అతని టీమ్‌లో కాకుండా వేరే టీమ్ తరుపున ఆడినా కూడా ఇదే చెప్పేవాడినేమో...
అతని ఆట చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఎంతో ఈజీగా సిక్సర్లు కొడతాడు. బ్యాటుతో, బంతితో దేన్నైనా చేయగల ఓ అద్భుతమైన అథ్లెట్... అద్భుతమైన ఫీల్డర్ కూడా’ అంటూ తన స్నేహితుడి గురించి చెప్పుకొచ్చాడు షేన్ వాట్సన్...