ధోనీ, రవీంద్ర జడేజా గొడవ నిజమేనా? జడ్డూ ఎందుకు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.. అంబటి రాయుడు కామెంట్స్..
ఐపీఎల్ 2020 సీజన్‌లో మొట్టమొదటిసారిగా ప్లేఆఫ్స్‌కి చేరలేకపోయింది సీఎస్‌కే. అయితే ఆ తర్వాతి సీజన్‌లోనే టైటిల్ గెలిచి సూపర్ కమ్‌బ్యాక్ ఇచ్చింది. కానీ ఐపీఎల్ 2021 సీజన్‌లో టైటిల్ గెలిచిన తర్వాత 2022 సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ అయ్యింది చెన్నై సూపర్ కింగ్స్...
Image credit: PTI
2022 సీజన్ ఆరంభానికి ముందు ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడం, ఎప్పటి నుంచో ధోనీ తర్వాత నేనే! అని ప్రకటించుకుంటూ వచ్చిన రవీంద్ర జడేజా... సీఎస్‌కే కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోవడం జరిగిపోయాయి.
అయితే ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుసగా మొదటి 4 మ్యాచుల్లో ఓడిన సీఎస్‌కే, 8 మ్యాచుల్లో 2 విజయాలు మాత్రమే అందుకోగలిగింది. రవీంద్ర జడేజా కేవలం నామమాత్రపు కెప్టెన్‌గానే మిగిలాడు..
ఫీల్డ్ సెట్టింగ్ దగ్గర్నుంచి అన్ని విషయాలను ఎమ్మెస్ ధోనీయే చూసుకునేవాడు. ఈ సమయంలో మాహీ, జడేజా మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని కూడా టాక్ వినబడింది.
ఈ సమయంలోనే రవీంద్ర జడేజా కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు. ఆ తర్వాత రెండు మ్యాచులకే గాయం వంకతో సీజన్ మొత్తానికి దూరమయ్యాడు..
ఆ తర్వాత కొన్ని రోజులకే రవీంద్ర జడేజాని, చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేసింది. రవీంద్ర జడేజా, సీఎస్‌కేకి సంబంధించిన ట్వీట్లు, కామెంట్లు, పోస్టులు అన్నీ డిలీట్ చేశాడు..
రవీంద్ర జడేజా, ఇక చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆడడం అనుమానమే అనుకున్నారంతా. అయితే ఊహించని విధంగా మళ్లీ ధోనీ మధ్యవర్తిత్వంతో సీఎస్‌కే తరుపున ఆడి, ఐపీఎల్ 2023 సీజన్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు రవీంద్ర జడేజా..
అసలు ఇంతకీ 2022 సీజన్‌లో ఏమైంది? రవీంద్ర జడేజా, ధోనీ మధ్య నిజంగానే అభిప్రాయ భేదాలు వచ్చాయా? ఈ విషయాలపై తాజాగా కామెంట్ చేశాడు సీఎస్‌కే మాజీ క్రికెటర్ అంబటి రాయుడు..
Jadeja CSK
‘మాహీ అంటే జడ్డూకి ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. మాహీ కారణంగా జడేజా ఎప్పుడూ బాధపడలేదు. అయితే ఆ సీజన్‌లో టీమ్ సరిగ్గా ఆడడం లేదని మాత్రం జడ్డూ చాలా ఫీల్ అయ్యాడు. ఆ సీజన్‌లో సీఎస్‌కే టీమ్‌లో ఏ ఒక్కరూ సరిగ్గా ఆడలేదు..
Image credit: PTI
జడేజా ఇప్పుడున్న పొజిషన్‌కి ధోనీయే కారణం. అతన్ని 10-12 ఏళ్లుగా చెక్కి చెక్కి స్టార్ ఆల్‌రౌండర్‌గా మలిచాడు. కాబట్టి ధోనీ ఏదో అన్నాడని జడ్డూకి కోపం వచ్చే అవకాశం లేదు. అయితే ఈ సీజన్‌లో టైటిల్ గెలిచినందుకు జడేజా చాలా సంతోషపడ్డాడు..
చెన్నై సూపర్ కింగ్స్‌లో టీమ్ మేట్స్ అందరూ ఓ కుటుంబ సభ్యుల్లాగా కలిసి మెలిసి ఉంటారు. అందుకే ఆ టీమ్ నుంచి బయటికి వెళ్లడానికి ఎవ్వరూ ఇష్టపడరు. వచ్చే సీజన్‌లో కూడా మాహీ భాయ్, సీఎస్‌కే కెప్టెన్‌గా కొనసాగుతాడని అనుకుంటున్నా...’ అంటూ కామెంట్ చేశాడు సీఎస్‌కే మాజీ ప్లేయర్ అంబటి రాయుడు..