- Home
- Sports
- Cricket
- బాగా వేశావని థమ్సప్ చూపిస్తావా! బుద్ధి ఉండే చేస్తున్నావా... స్టీవ్ స్మిత్‌పై బోర్డర్ ఆగ్రహాం...
బాగా వేశావని థమ్సప్ చూపిస్తావా! బుద్ధి ఉండే చేస్తున్నావా... స్టీవ్ స్మిత్‌పై బోర్డర్ ఆగ్రహాం...
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 ఆరంభానికి ముందు ఆస్ట్రేలియానే ఫెవరెట్. టెస్టుల్లో నెం.1 టీమ్‌గా ఉన్న ఆసీస్, వరుస విజయాలతో దుమ్మురేపుతోంది. స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ ఇలా అందరూ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. అయితే మొదటి టెస్టులో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది....

Image credit: PTI
భారత స్పిన్ బౌలర్లను ఎదుర్కోవడానికి పగుళ్లు తేలిన పిచ్‌పై బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసి, నానా హడావుడి చేసిన ఆస్ట్రేలియా... నాగ్‌పూర్ టెస్టులో చిత్తుగా ఓడింది. నెం.1 టెస్టు టీమ్ హోదాలో ఉన్న ఆస్ట్రేలియా... రెండో ఇన్నింగ్స్‌లో 91 పరుగులకి ఆలౌట్ అయ్యి, 132 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది...
Image credit: PTI
టీమిండియా తరుపున కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీలు చేయగా ఆస్ట్రేలియా రెండు ఇన్నింగ్స్‌ల్లో ఒక్కటంటే ఒక్క హాఫ్ సెంచరీ నమోదు చేయలేకపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో మార్నస్ లబుషేన్ నమోదు చేసిన 49 పరుగులే, తొలి టెస్టులో ఆస్ట్రేలియాకి అత్యధిక వ్యక్తిగత స్కోరు...
Image credit: PTI
అశ్విన్ డూప్ మహేశ్ పిథియాతో నెట్స్‌లో ప్రాక్టీస్ చేసిన స్టీవ్ స్మిత్, భారత బౌలర్లకు థమ్సప్ చూపిస్తూ ఉత్సాహపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 37, రెండో ఇన్నింగ్స్‌లో 25 పరుగులు మాత్రమే చేశాడు స్టీవ్ స్మిత్. స్మిత్ బ్యాటింగ్ స్టైల్‌ని తీవ్రంగా విమర్శించాడు ఆసీస్ మాజీ లెజెండ్ ఆలెన్ బోర్డర్...
Steve Smith
‘భారత పిచ్‌లపై ఎడ్జ్ రాకుండా బ్యాటింగ్ చేయాలి. భారత స్పిన్నర్లు ఆఫ్ స్టంప్ అవతల బాల్ వేసి, నిన్ను బీట్ చేసిన ప్రతీసారి వాళ్లకు థమ్సప్ చూపిస్తున్నారు. ఎక్కడ ఏం నడుస్తోంది. ఇది పిచ్చి. బుద్ధి ఉండే ఈ పని చేస్తున్నావా...
ఆస్ట్రేలియా ఎప్పుడూ అగ్రెసివ్ క్రికెట్ ఆడుతుంది. ప్రత్యర్థి బౌలర్లకు థమ్సప్ ఇవ్వడమనేది చెత్త పని. ఆ సమయంలో నీ వీక్‌నెస్ బౌలర్లకు అర్థమైపోతోంది. ఇండియా టూర్ ఎలా ఉండబోతుందో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంకా మూడు టెస్టులు ఆడాలి. చాలా కఠినమైన పిచ్‌లను ఫేస్ చేయాలి...
పరుగులు చేసేందుకు మార్గాలు వెతుక్కోవడం చాలా కష్టమైన పని.అయితే ఓపిక ఉంటే, ఏదైనా సాధించొచ్చు. డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం ఉడికిపోవాలి. చెత్తను మొత్తం బయటపడేయండి. ఇలా ఆడాలి, అలా ఆడాలి ఆలోచనలు చేసింది చాలు... ఇక్కడి నుంచి ఎలా బయటపడాలనేదానిపైనే ఫోకస్ పెట్టండి..’ అంటూ కామెంట్ చేశాడు ఆలెన్ బోర్డర్..