అజింకా రహానేకి విజ్డెన్ 2020 పురస్కారం... ఆసీస్‌పై బాక్సింగ్ డే టెస్టు ఇన్నింగ్స్‌కు...
First Published Jan 8, 2021, 11:11 AM IST
తన కెప్టెన్సీతో విమర్శకులను మెప్పిస్తున్న తాత్కాలిక సారథి అజింకా రహానేకి విజ్డెన్ పురస్కారం దక్కింది. 2020 బెస్ట్ టెస్ట్ ఇన్నింగ్స్‌గా బాక్సింగ్ డే టెస్టులో అజింకా రహానే అద్భుత సెంచరీ ఇన్నింగ్స్ ఎంపికైంది. 2020 ఏడాదికి గానూ టాప్10 బెస్ట్ టెస్టు ఇన్నింగ్స్‌లను ప్రకటించింది విజ్డెన్.

1. అజింకా రహానే క్లాస్ సెంచరీ... ఆడిలైడ్‌లో 36 పరుగులకే పరిమితమై, చెత్త రికార్డు నమోదుచేసిన తర్వాత బాక్సింగ్ డే టెస్టులో అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది టీమిండియా. మెల్‌బోర్న్‌లో జరిగిన ఈ టెస్టులో అజింకా రహానే అద్భుత సెంచరీతో అదరగొట్టాడు.

విరాట్ కోహ్లీ నుంచి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన రహానే... బ్యాటింగ్‌కి అసలు సహకరించని పిచ్‌పై 223 బంతుల్లో 112 పరుగులు చేశాడు. రహానే ఇన్నింగ్స్ కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో 131 పరుగుల ఆధిక్యం సాధించిన టీమిండియా, 8 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?