- Home
- Sports
- Cricket
- శిఖర్ ధావన్ మళ్లీ టీమ్‌లోకి ఎలా వచ్చాడో తెలియట్లా... టీమిండియా మాజీ క్రికెటర్ కామెంట్...
శిఖర్ ధావన్ మళ్లీ టీమ్‌లోకి ఎలా వచ్చాడో తెలియట్లా... టీమిండియా మాజీ క్రికెటర్ కామెంట్...
టీ20 టీమ్‌లో చోటు కోల్పోయిన శిఖర్ ధావన్, వన్డేల్లో మాత్రం కొనసాగుతూనే ఉన్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న శిఖర్ ధావన్ తొలి వన్డేలో 3 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు...

శుబ్‌మన్ గిల్‌తో కలిసి 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన శిఖర్ ధావన్, వెస్టిండీస్‌లో ఐదో 50+ స్కోరు. విరాట్ కోహ్లీ 7 సార్లు 50+ స్కోర్లు చేసి టాప్‌లో ఉంటే, ఐదు సార్లు ఈ ఫీట్ సాధించిన రోహిత్ శర్మతో సమంగా నిలిచాడు శిఖర్ ధావన్...
శిఖర్ ధావన్‌కి ఇది 150వ వన్డే. తొలి 150 వన్డేల్లో అత్యధిక 50+ స్కోర్లు చేసిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు శిఖర్ ధావన్. శిఖర్ ధావన్‌కి ఇది 53వ 50+ స్కోరు కాగా హషీమ్ ఆమ్లా 57 సార్లు, విరాట్ కోహ్లీ, వీవ్ రిచర్స్ 55 సార్లు ఈ ఫీట్ సాధించారు...
Image credit: Getty
‘శిఖర్ ధావన్ విషయంలో నేను చాలా అయోమయంలో ఉన్నా. అతనికి టీమ్‌లో చోటు ఎలా దక్కిందో కూడా అర్థం కావడం లేదు. 6 నెలల ముందు అతన్ని జట్టు నుంచి తీసేశారు...
Shikhar Dhawan
శిఖర్ ధావన్ కంటే కెఎల్ రాహుల్ బెటర్ అని ఫిక్స్ అయ్యారు. సడెన్‌గా శిఖర్ ధావన్‌ని పిలిచి మళ్లీ కెప్టెన్సీ అప్పగించారు. ఒకసారి తప్పించి, ఒకసారి ఆడించి... ధావన్‌తో ప్రయోగాలు చేస్తున్నారో అర్థం కావడం లేదు...
రోహిత్ శర్మ అగ్రెసివ్ బ్రాండ్ క్రికెట్‌కి శిఖర్ ధావన్ సెట్ కాడు. కెఎల్ రాహుల్ రీఎంట్రీ ఇస్తే శిఖర్ ధావన్‌కి టీమ్‌లో చోటు దక్కడం కష్టమే...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా...