MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • శుభం కార్డు పడే దిశగా ఐపీఎల్.. ఆ తర్వాత టీమిండియాకు పీక్ షెడ్యూల్..

శుభం కార్డు పడే దిశగా ఐపీఎల్.. ఆ తర్వాత టీమిండియాకు పీక్ షెడ్యూల్..

IPL 2023 Playoffs:  రెండు నెలలుగా సాగుతున్న ఐపీఎల్ - 16 ఎండింగ్ స్టేజ్ కు చేరుకున్నది. మరో రెండు మ్యాచ్ లు అయితే ఈ సీజన్ కు మంగళం పాడినట్టే.. 

2 Min read
Author : Srinivas M
Published : May 26 2023, 05:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈ ఏడాది ప్రారంభం నుంచి తీరిక లేని షెడ్యూల్ తో గడుపుతున్న  రోహిత్ సేన.. మార్చిలో  ఆస్ట్రేలియతో ముగిసిన  బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ, వన్డే సిరీస్ తర్వాత  నేరుగా ఐపీఎల్ కు వచ్చింది.  రెండు నెలలుగా సాగుతున్న ఐపీఎల్ -16  ఈ ఆదివారంతో ముగియనుంది. మరి దీని తర్వాత ఏంటి..?  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఐపీఎల్ ముగిసినవెంటనే వారం రోజులకు  టీమిండియా.. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడనుంది.  జూన్ 7 నుంచి  11 వరకూ  ఆస్ట్రేలియాతో   జరుగబోయే ఫైనల్ లో టీమిండియా తలపడనుంది.  డబ్ల్యూటీసీ ఫైనల్స్ తర్వాత  భారత జట్టు జూన్  లోనే అఫ్గానిస్తాన్ తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  మూడు వన్డేలకు బదులు.. టీ20లు ఆడిస్తారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై  ప్రకటన వెలువడే అవకాశముంది. 

36

ఇక జులై  - ఆగస్టులో భారత జట్టు కరేబియన్ దీవులకు వెళ్లనుంది. ఇక్కడ వెస్టిండీస్ తో  రెండు టెస్టులు,  మూడు వన్డేలు,  ఐదు టీ20 మ్యాచ్ లు  జరుగుతాయి.   ఈ సిరీస్ లో చివరి రెండు టీ20లను అమెరికాలో జరిపించేందుకు  వెస్టిండీస్ క్రికెట్ బోర్డు  ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఆగస్టులో  ఐర్లాండ్ జట్టుతో టీమిండియా మూడు  టీ20 మ్యాచ్ లు ఆడనుంది. 

46

సెప్టెంబర్ లో కీలక ఆసియా కప్ (వన్డే ఫార్మాట్)  జరగాల్సి ఉంది.  అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది ఆసియా కప్ పాకిస్తాన్ లో జరగాల్సి ఉన్నా  భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టు అక్కడకి వెళ్లేందుకు అంగీకరించకపోవడంతో దీనిపై సందిగ్దత నెలకొంది.  ఐపీఎల్ - 16 ఫైనల్ లో  ఆసియా కప్ షెడ్యూల్, వేదికల మీద  స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

56

ఆసియా కప్ తర్వాత  సెప్టెంబర్ లోనే భారత జట్టు  స్వంత గడ్డపై   ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు ఆడనుంది.    ఇవి ముగిశాక..  అక్టోబర్ - నవంబర్ లో  భారత్ లోనే వన్డే వరల్డ్ కప్ జరుగనుంది.   

66

వరల్డ్ కప్ ముగిశాక  ఆస్ట్రేలియాతోనే నవంబర్ - డిసెంబర్ మధ్య  ఐదు టీ20లు జరుగుతాయి. ఈ సిరీస్  తర్వాత భారత జట్టు డిసెంబర్ లో  దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది.  అక్కడ మూడు ఫార్మాట్ల సిరీస్ లు  జరుగాల్సి ఉంది. దీనిపై ఇంకా అధికారిక షెడ్యూల్ వెలువడలేదు. 

About the Author

SM
Srinivas M
Latest Videos
Recommended Stories
Recommended image1
Ajinkya Rahane: అజింక్య రహానేకు బీసీసీఐ నెలనెలా పెన్షన్.. ఎంత వస్తుందో తెలుసా?
Recommended image2
Hardik Pandya New Look : హార్దిక్ పాండ్యా కొత్త లుక్ అదిరిందిగా
Recommended image3
Hardik Pandya: ధోనీతో పాండ్యా సీక్రెట్ మీటింగ్? ముంబైకి షాకిచ్చి చెన్నైలోకి హార్దిక్ మాస్ ఎంట్రీ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved