- Home
- Sports
- Cricket
- వెస్టిండీస్ సిరీస్ తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న రోహిత్ శర్మ... కొత్త కెప్టెన్ విషయంలో...
వెస్టిండీస్ సిరీస్ తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న రోహిత్ శర్మ... కొత్త కెప్టెన్ విషయంలో...
కేప్‌టౌన్ టెస్టు తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు విరాట్ కోహ్లీ. టెస్టుల్లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ, బీసీసీఐ రాజకీయాలతో విసుగు చెంది, సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు..

Rohit Sharma
విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో అప్పటికే టీ20, వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న రోహిత్ శర్మకు టెస్టు సారథ్య బాధ్యతలు కూడా అప్పగించింది బీసీసీఐ. అయితే కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నా, టీమ్‌కి పూర్తిగా అందుబాటులో ఉండలేకపోయాడు రోహిత్ శర్మ...
Rohit Sharma-Gill
రోహిత్ కరోనా బారిన పడడంతో ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టుకి జస్ప్రిత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరిస్తే, బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కి కెఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్, కెప్టెన్‌గా రోహిత్‌కి మొట్టమొదటి ఫారిన్ మ్యాచ్...
ఈ వయసులో మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతల ప్రెషర్‌ని రోహిత్ శర్మకు ఇవ్వడం కరెక్ట్ కాదని భావిస్తున్న బీసీసీఐ, వెస్టిండీస్ టూర్ తర్వాత కొత్త టెస్టు కెప్టెన్‌ని వెతికే పనిలో పడిందట...
Rohit Sharma
వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనలో రెండు టెస్టులకు సారథిగా వ్యవహరించబోతున్నాడు రోహిత్ శర్మ. ఈ టెస్టులకు రోహిత్ శర్మ సారథిగా వ్యవహరిస్తాడు. ఆ తర్వాత బీసీసీఐ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, ప్రస్తుత సారథి రోహిత్ శర్మ కలిసి టీమిండియా ఫ్యూచర్ టెస్టు కెప్టెన్‌ని ఎంచుకుంటారు...
టెస్టుల్లో నెం.1 ఐసీసీ బౌలర్‌గా ఉన్న రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు రవీంద్ర జడేజాలను ఫ్యూచర్ టెస్టు కెప్టెన్ అభ్యర్థులగా భావిస్తోంది బీసీసీఐ. అయితే వీరికి 35 ఏళ్లు దాటుతుండడంతో శుబ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్ వంటి యంగ్ ప్లేయర్‌కి టెస్టు కెప్టెన్సీ ఇవ్వాలని చూస్తోంది బీసీసీఐ..
Rohit Sharma
టెస్టుల్లో వరుసగా విఫలం అవుతున్న ఛతేశ్వర్ పూజారా, ఉమేశ్ యాదవ్ వంటి సీనియర్లను వెస్టిండీస్ సిరీస్ నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇదే జరిగితే ఎన్నో ఏళ్లుగా టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్న సర్ఫరాజ్ ఖాన్‌కి అవకాశం దక్కొచ్చు..