- Home
- Sports
- Cricket
- ఐపీఎల్‌లో సూపర్ హిట్, ఐసీసీ టోర్నీల్లో వీళ్లపైనే భారం... అక్కడ టీమిండియాకి ఈసారైనా వర్కవుట్ అవుద్దా...
ఐపీఎల్‌లో సూపర్ హిట్, ఐసీసీ టోర్నీల్లో వీళ్లపైనే భారం... అక్కడ టీమిండియాకి ఈసారైనా వర్కవుట్ అవుద్దా...
గత సీజన్లతో పోలిస్తే ఐపీఎల్ 2023 సీజన్, టీమిండియాలో పాజిటివ్ ఎనర్జీ నింపింది. జస్ప్రిత్ బుమ్రా, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ ఈ సీజన్‌లో ఆడకపోయినా కెఎల్ రాహుల్ మధ్యలోనే గాయపడినా ఆడినంత వరకూ టీమిండియా ప్లేయర్లు సక్సెస్ అయ్యారు...

PTI Photo/Kunal Patil) (PTI05_26_2023_000255B)
ఐపీఎల్ 2023 సీజన్‌లో 890 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో చూపించిన బీభత్సమైన ఫామ్‌ని కొనసాగించాడు. ఇది టీమిండియాకి చాలా పాజిటివ్ విషయం.ఇదే ఫామ్‌ని ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్, వన్డే వరల్డ్ కప్ వరకూ కొనసాగిస్తే... టీమిండియాకి చాలా పెద్ద బలం అవుతాడు శుబ్‌మన్ గిల్...
PTI Photo/R Senthil Kumar)(PTI05_24_2023_000212B)
రోహిత్ శర్మ ఎప్పటిలాగే ఈ సీజన్‌లో కూడా మెరుపులు మెరిపించలేకపోయాడు. అయితే రోహిత్ శర్మ ఐపీఎల్‌లో ఫెయిల్ అవ్వడం, అంతర్జాతీయ క్రికెట్‌లో సక్సెస్ అవ్వడం చాలా కామన్. కాబట్టి అతని ఫామ్ గురించి కూడా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..
Image credit: PTI
ఐపీఎల్ 2023 సీజన్‌లో రెండు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో పాటు 6 హాఫ్ సెంచరీలతో 639 పరుగులు చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ సీజన్‌ని నమోదు చేశాడు విరాట్ కోహ్లీ. గత మూడేళ్లలో విరాట్ కోహ్లీ నుంచి ఇలాంటి ప్రదర్శన రాలేదు. దీంతో విరాట్ కోహ్లీ ఫామ్, టీమిండియాకి బాగా హెల్ప్ అవ్వొచ్చు..
Suryakumar Yadav
ఐపీఎల్ 2023 సీజన్‌కి ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్, మూడు మ్యాచుల్లోనూ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. పేలవ ఫామ్‌ని సీజన్ ఆరంభంలోనూ కొనసాగించిన సూర్యకుమార్ యాదవ్, ఆ తర్వాత అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇస్తూ 605 పరుగులు చేశాడు...
Image credit: PTI
రవీంద్ర జడేజా తన ఐపీఎల్ కెరీర్‌లోనే మొట్టమొదటిసారిగా 2023లో 20 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు అప్పుడెప్పుడో 2014లో తీసిన 19 వికెట్లే జడ్డూ అత్యధికం. బ్యాటింగ్‌లోనూ 175 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు..
మహ్మద్ షమీ ఈ సీజన్‌లో 28 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలవగా మహ్మద్ సిరాజ్ 19 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ బ్యాటుతో 283 పరుగులు, బంతితో 11 వికెట్లు తీసి ఆల్‌రౌండర్‌గా సత్తా చాటితే... రవిచంద్రన్ అశ్విన్ 11 వికెట్లు తీశాడు.
ఇషాన్ కిషన్ 454 పరుగులు చేస్తే, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో 7 వికెట్లు, బ్యాటింగ్‌లో 113 పరుగులు చేశాడు. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత హాఫ్ సెంచరీ బాదాడు...
ఓ రకంగా టీమిండియాకి కీ ప్లేయర్లుగా ఉన్నవారంతా ఐపీఎల్ 2023 సీజన్‌లో బాగానే ఆడారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో బాగా ఆడి కాసులకు న్యాయం చేసిన భారత ప్లేయర్లు, ఐసీసీ టోర్నీల్లో అదరగొడితే 2013 నుంచి నెరవేరని ఐసీసీ టైటిల్ నెరవేరడం పెద్ద కష్టమేమీ కాదు..
అయితే ఐపీఎల్‌లో ఆడినవాళ్లు, ఐసీసీ టోర్నీల్లో అదే రకమైన పర్పామెన్స్ ఇవ్వగలరా? అనేదే అసలైన ఛాలెంజ్..