- Home
- Sports
- Cricket
- హమ్మయ్య.. ఎవరికీ తాకలేదు.. ఢిల్లీ ఆటగాళ్లంతా సేఫ్..! నేడు బెంగళూరుతో రాత్రి మ్యాచ్ కు రెడీ
హమ్మయ్య.. ఎవరికీ తాకలేదు.. ఢిల్లీ ఆటగాళ్లంతా సేఫ్..! నేడు బెంగళూరుతో రాత్రి మ్యాచ్ కు రెడీ
TATA IPL 2022 - DC vs RCB: ఐపీఎల్-2022 సీజన్ లో తొలి కరోనా కేసు నమోదు కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్ లో ఒకటే ఆందోళన. ఢిల్లీ జట్టు ఫిజియో ప్యాట్రిక్ ఫార్‌హర్ట్ కు కరోనా సోకిన విషయం తెలిసిందే.

ఢిల్లీ క్యాపిటల్స్ ఫిజియో ప్యాట్రిక్ ఫార్‌హర్ట్ కు కరోనా సోకడంతో ఆ జట్టు ఆందోళనకు గురైంది. అతడితో సన్నిహితంగా ఉన్న ఆటగాళ్లందరినీ శుక్రవారం సాయంత్రం తో పాటు శనివారం ఉదయం కూడా పరీక్షలు నిర్వహించారు.
అయితే శుక్రవారం నాటి ఫలితాలు అన్నీ ఆశాజనకంగానే ఉన్నాయి. ప్యాట్రిక్ నుంచి ఇప్పటికైతే కరోనా ఎవరికీ సోకలేదని, ప్రస్తుతం అతడిని ఐసోలేషన్ లో ఉంచినట్టు ఢిల్లీ క్యాపిటల్స్ వైద్య బృందం తెలిపింది.
ప్యాట్రిక్ కు కరోనా నిర్ధారణ కాగానే అతడికి సన్నిహితంగా మెగిలిన వారితో పాటు ఢిల్లీ ఆటగాళ్లందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం నాటి ఫలితాలలో అందరికీ నెగిటివ్ గా తేలింది. శనివారం ఉదయం కూడా మరోసారి పరీక్షలు చేయగా అవే ఫలితాలు వచ్చినట్టు ఢిల్లీ తెలిపింది.
దీంతో శనివారం సాయంత్రం జరగాల్సి ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ కు ఏ ఆటంకం లేదని, దానిని షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రతినిధులు తెలిపారు.
ఢిల్లీ ఆటగాళ్లంతా డబుల్ డోస్ వ్యాక్సినేషన్ వేసుకున్నారని, సిబ్బంది బూస్టర్ డోస్ కూడా తీసుకున్నారని బీసీసీఐ తెలిపింది. ప్యాట్రిక్ కు కరోనా సోకడంతో ఒకింత ఆందోళనకు గురైన ఢిల్లీకి.. బీసీసీఐ ధైర్యం చెప్పింది. భయపడాల్సిందేమీ లేదని, కరోనా సోకిన ప్యాట్రిక్ ప్రస్తుతం ఐసోలేషన్ లో బాగానే ఉన్నాడని వివరించింది.
శనివారం రాత్రి వాంఖెడే వేదికగా ఢిల్లీ - బెంగళూరు తలపడనున్నాయి. ఈ సీజన్ లో ఈ రెండు జట్లు పోటీ పడుతుండటం ఇదే ప్రథమం.
ఇదిలాఉండగా.. తీవ్రమైన ఆంక్షలు కఠినమైన నిబంధనల నడుమ బయో బబుల్ లో ఉన్న ఆటగాళ్లు, సిబ్బంది ఉంటుండగా.. ఇందులోకి కరోనా ఎలా ప్రవేశించిందన్నదే ఇక్కడ అసలు ప్రశ్న...?
గతేడాది కూడా ఐపీఎల్ లో కరోనా కేసులు ఒక్కొక్కటి పెరిగిన తర్వాతే సీజన్ (మే లో) ను అర్థాంతరంగా వాయిదా వేశారు. మళ్లీ మూడు నెలల తర్వాత దుబాయ్ వేదికగా విజయవంతంగా నిర్వహించారు. ఈ ఏడాది అలా కాకుండా ఉండేందుకు బీసీసీఐ పటిష్ట చర్యలు తీసుకున్నా కరోనా బబుల్ లోకి ఎంటర్ అవడం గమనార్హం.