- Home
- Sports
- Cricket
- వరల్డ్ కప్ పోతేనేం! ఐపీఎల్ ముఖ్యం భయ్యో... బుమ్రా, జడేజా గాయాలతో బీసీసీఐపై ట్రోల్స్...
వరల్డ్ కప్ పోతేనేం! ఐపీఎల్ ముఖ్యం భయ్యో... బుమ్రా, జడేజా గాయాలతో బీసీసీఐపై ట్రోల్స్...
టీమిండియా ఐసీసీ టైటిల్ గెలిచి 9 ఏళ్లు అవుతోంది. 2015, 2019 వన్డే వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్ నుంచి నిష్కమించిన భారత జట్టు, 2021 టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్ కూడా చేరలేకపోయింది. అయితే ఈసారి భారత జట్టుపై భారీ అంచనాలే ఉండేవి. కారణం ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన రోహిత్ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోవడమే...

bumrah
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు జరిగిన ఆసియా కప్‌లో రవీంద్ర జడేజా గాయపడినా, భారత జట్టు వరుస ఫెయిల్యూర్లతో ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయినా అభిమానులు పెద్దగా ఫీల్ అవ్వలేదు. జస్ప్రిత్ బుమ్రా గాయం నుంచి కోలుకుని, జట్టుతో తిరిగి కలిస్తే ఈ సమస్యలన్నీ తీరిపోతాయని ధీమా వ్యక్తం చేశారు...
Image credit: Getty
అయితే గాయం నుంచి కోలుకున్న జస్ప్రిత్ బుమ్రా, రెండంటే రెండు టీ20 మ్యాచులు ఆడగానే మళ్లీ తప్పుకున్నాడు. వెన్ను గాయం తిరగబెట్టడంతో జస్ప్రిత్ బుమ్రా, నాలుగు నెలల పాటు క్రికెట్‌కి దూరంగా ఉండాలని వైద్యులు సూచించినట్టు సమాచారం...
Jasprit Bumrah
జస్ప్రిత్ బుమ్రా గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకోవడంతో బీసీసీఐపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. 2019 నుంచి ఇప్పటిదాకా నాలుగు సీజన్లలో కలిపి జస్ప్రిత్ బుమ్రా, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఆడిన అన్నీ మ్యాచుల్లోనూ అందుబాటులో ఉన్నాడు...
2020 సీజన్‌లో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే జస్ప్రిత్ బుమ్రాకి రెస్ట్ ఇచ్చింది ముంబై ఇండియన్స్. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోయినా ఈ మ్యాచ్‌లో రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ, నెలన్నర పాటు టీమిండియాకి దూరమయ్యాడు....
ఇదే సమయంలో 2019 నుంచి ఇప్పటిదాకా భారత జట్టు 70 అంతర్జాతీయ మ్యాచులు ఆడితే అందులో జస్ప్రిత్ బుమ్రా ఆడింది కేవలం 16 మాత్రమే. ముంబై ఇండియన్స్‌కి మ్యాచ్ విన్నర్‌గా ఉన్న జస్ప్రిత్ బుమ్రా, టీమిండియాకి కూడా తన బౌలింగ్‌తో ఎన్నో విజయాలు అందించాడు...
Mumbai Indians
టెస్టు ఛాంపియన్‌షిప్ 2021 ఫైనల్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కూడా ఒక్క వికెట్ తీయలేకపోయిన జస్ప్రిత్ బుమ్రా, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలోనూ చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. బుమ్రా మీద బోలెడన్ని ఆశలతో టీమిండియా, ఐసీసీ టోర్నీల్లో ఫెవరెట్‌గా అడుగుపెట్టడం, భంగపడి వెనక్కి రావడం ఆనవాయితీగా వస్తోంది..
ఐపీఎల్‌లో పూర్తి ఫిట్‌నెస్‌తో బరిలో దిగుతూ అద్భుత ప్రదర్శన ఇస్తున్న జస్ప్రిత్ బుమ్రా, భారత జట్టుకి అదే రకమైన పర్ఫామెన్స్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాడనేది అభిమానులను వెంటాడుతున్న ప్రశ్న. బీసీసీఐకి ఐపీఎల్ ముఖ్యం. ఐపీఎల్ ద్వారా వచ్చే వేల కోట్ల ఆదాయం అంతకంటే అవసరం...
Jasprit Bumrah
భారత క్రికెట్ బోర్డే, ఐపీఎల్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినప్పుడు ఐసీసీ టోర్నీల్లో జట్టు ఫెయిల్ అవుతుందని అభిమానులు ఫీల్ అవ్వడం తప్ప, పెద్దగా చేసేదేమీ లేదంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్.
జాతీయ జట్టుకి అందుబాటులో ఉండేందుకు బీబీఎల్, ఐపీఎల్ నుంచి మిచెల్ స్టార్క్ తప్పుకుంటున్నట్టుగా, జస్ప్రిత్ బుమ్రా, టీమిండియాకి ఆడేందుకు ముంబై ఇండియన్స్ నుంచి తప్పుకోగలడా? అని ప్రశ్నిస్తున్నారు...