MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • పాకిస్తాన్ టీమ్‌కు వరల్డ్ కప్‌లు గెలిచే సత్తా పుష్కలంగా ఉంది.. ఆన్‌లైన్ కోచ్ బాగానే ఆశిస్తున్నాడుగా!

పాకిస్తాన్ టీమ్‌కు వరల్డ్ కప్‌లు గెలిచే సత్తా పుష్కలంగా ఉంది.. ఆన్‌లైన్ కోచ్ బాగానే ఆశిస్తున్నాడుగా!

Pakistan Cricket: బాబర్ ఆజమ్ సారథ్యంలోని పాకిస్తాన్ క్రికెట్ జట్టు  వన్డే వరల్డ్ కప్ మాత్రమే గాక ఇతర మేజర్ టోర్నీలు గెలిచే సత్తా ఉందంటున్నాడు కొత్త కోచ్.

2 Min read
Author : Srinivas M
Published : Apr 22 2023, 04:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఇటీవలే డైరెక్టర్ ఆఫ్  క్రికెట్ గా ఎంపికైన  మికీ ఆర్థర్ ఆ జట్టు మీద భారీ ఆశలే పెట్టుకున్నట్టున్నాడు.  ఆన్‌లైన్ కోచ్ గా పనిచేసే ఆయన.. బాబర్ ఆజమ్ సారథ్యంలోని పాకిస్తాన్ జట్టు  రాబోయే వన్డే వరల్డ్ కప్ తో పాటు మూడు ఫార్మాట్లలోనూ సత్తా చాటగల టీమ్ అని కొనియాడాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఆర్థర్ కొత్త బాధ్యతలు తీసుకున్న తర్వాత రావల్పిండిలో  విలేకరుల సమావేశంలో మాట్లాడాడు.  ‘నాతో చాలా మంది పాకిస్తాన్ మీ బ్లడ్ లోనే ఉందని అన్నారు.  అవును. అది నిజమే. ఈ దేశంతో నాకు  ఏదో విడదీయరాని ఎమోషనల్  అటాచ్‌మెంట్ ఉంది.  ఈ దేశం, క్రికెట్ టీమ్ తో  నా జర్నీ  చాలా స్పెషల్. 

37

పాకిస్తాన్ జట్టుతో తిరిగి పనిచేయడం నేను గర్వంగా భావిస్తున్నా.  ఈ టీమ్  కోసం ఏమైనా చేయడానికి నేను రెడీ. ఈ జట్టుకు ప్రపంచకప్ గెలిచే  సత్తా ఉంది. ఒక్క వన్డేలోనే కాదు మూడు  ఫార్మాట్లలోనూ ఈ టీమ్  చాలా బలంగా ఉంది.  జట్టులో  టాలెంట్ ఉన్న  ప్లేయర్లు పుష్కలంగా ఉన్నారు...’అని అన్నాడు. 

47

ఇక  కెప్టెన్ బాబర్ ఆజమ్ గురించి స్పందిస్తూ.. ‘బాబర్ లో టాలెంట్ ఉందని  నేను ఈ టీమ్ కు హెడ్ కోచ్ గా ఉన్నప్పుడే గుర్తించి అతడిని ప్రోత్సహించా. బాబర్ టాలెంట్ అంతా అతడి చేతుల్లోనే ఉంది.   నేను ముందు నెట్స్ లో బాబర్ ఆట చూసి  ఆశ్చర్యపోయా.   బ్యాటింగ్ చేసే క్రమంలో బాబర్ తన హ్యాండ్ మూమెంట్ ను తిప్పే విధానం నన్ను  మైమరిపింపజేసింది.  ప్రపంచ క్రికెట్ లో  నేను మరే ఇతర ఆటగాళ్లలోనూ ఇలాంటి టాలెంట్ చూడలేదు. 

57

అతడు టీమ్ లో కీలక ప్లేయర్ అవుతాడని ముందే ఊహించా. ఇప్పుడు మీరు  చూస్తున్న బాబర్ ను  నేను నాలుగేండ్ల క్రితమే  అంచనా వేశా.  కానీ  అతడు ఇంకాస్త ఇంప్రూవ్ అవ్వాలి. నేను దాని మీద  దృష్టి  పెడతా..’ అని చెప్పాడు. 

67

పాకిస్తాన్ జట్టు వరల్డ్ కప్ గెలవడం గురించి ఆర్థర్ వ్యాఖ్యలు నమ్మశక్యంగా లేకపోయినా  అతడు మాత్రం   తీసుకున్న డబ్బులకు న్యాయం  చేస్తున్నాడని  పాకిస్తాన్ మాజీలే కామెంట్స్ చేస్తున్నారు. సాక్షాత్తు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ రమీజ్ రాజానే ఆర్థర్ నియామకాన్ని విలేజ్ సర్కస్  తో పోల్చాడు. ఇక  పాకిస్తాన్ జట్టు చివరిసారిగా   1992లో వన్డే వరల్డ్ కప్  నెగ్గింది.  2009లో  టీ20 ప్రపంచకప్ గెలిచింది.  ఇక టెస్టులలో ఆ జట్టు ప్రదర్శన గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 

77

పాకిస్తాన్ జట్టుకు  పార్ట్ టైమ్ బేసిస్  లో పది నెలల కాలానికి గాను  మికీ ఆర్థర్  డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ గా ఇటీవలే  ఎంపికైన విషయం తెలిసిందే. అయితే ఆయన  టీమ్ తో ఉండడు. అంతా ఆన్ లైన్ లోనే వ్యవహారాలు నడిపిస్తుంటాడు.  ఆన్ లైన్ కోచ్ అని పేరు పెడితే మరీ  వింతగా ఉంటుందని  దానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కాస్త అందంగా డైరెక్టర్ ఆఫ్ క్రికెట్  అని పేరుపెట్టింది.  ఆర్థర్ గతంలో 2016 నుంచి 2019 వరకు పాకిస్తాన్ కు హెడ్ కోచ్ గా పనిచేశాడు. 

About the Author

SM
Srinivas M
పాకిస్తాన్

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs IRE : ఐర్లాండ్ ల్యాండ్ షేకింగ్ విక్టరీ.. ఈ పసికూన చేతిలో టీమిండియా ఓటమికి టాప్ 5 రీజన్స్ ఇవే
Recommended image2
T20 World Cup 2026: తెలుగమ్మాయి దెబ్బకు వరల్డ్ రికార్డులు బ్రేక్.. టీ20 వరల్డ్ కప్ లో దుమ్మురేపుతున్న శ్రీచరణి
Recommended image3
T20 World Cup: బంగ్లాపై గెలిచినా ఇండియాకు సెమీస్ టెన్షన్.. ఆసీస్‌ను కొడితేనే గండం గట్టెక్కేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved