ఆ మహిళా క్రికెటర్‌ను పెళ్లాడబోతున్న శిఖర్ ధావన్!... సోషల్ మీడియాలో గబ్బర్ రెండో పెళ్లిపై జోరుగా ప్రచారం...
శిఖర్ ధావన్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఐపీఎల్‌లో నిలకడైన ప్రదర్శన ఇస్తున్నా, టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో చోటు దక్కించుకోలేక సోషల్ మీడియాలో వైరల్ అయిన ధావన్, ఆ తర్వాత భార్యతో విడాకులు తీసుకుని వార్తల్లో నిలిచాడు...
భారత క్రికెటర్లలో శిఖర్ ధావన్ యాటిట్యూడ్ చాలా స్పెషల్. ప్రత్యర్థి ప్లేయర్ల మనసును ఏ మాత్రం గాయపరచకుండా, తన స్టైల్‌లో సెలబ్రేట్ చేసుకునే శిఖర్ ధావన్, సెంచరీ చేసి అవుటైనా, డకౌట్ అయినా చిరునవ్వుతో పెవిలియన్ చేరుతూ ఉంటాడు...
గత 6 సీజన్లుగా ఐపీఎల్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తూ, ఈ సీజన్‌లోనూ ఆరెంజ్ క్యాప్ రేసులో నిలిచిన శిఖర్ ధావన్, ఐపీఎల్ సెకండ్ ఫేజ్‌కి ముందు అయేసా ముఖర్జీతో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించాడు...
ఫేస్‌బుక్‌లో కలిసి అయేషా ముఖర్జీని ప్రేమించి, పెళ్లాడిన శిఖర్ ధావన్... 8 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు...
తన కంటే వయసులో పదేళ్లు పెద్దది, ఇద్దరు పిల్లల తల్లి అయిన అయేషాను ఏరికోరి ప్రేమించి, పెళ్లాడాడు శిఖర్ ధావన్. అయితే ఈ ఇద్దరి వైవాహిక జీవితానికి విడాకుల రూపంలో 8 ఏళ్లకే ఫుల్‌స్టాప్ పడింది...
అయితే ఇప్పుడు శిఖర్ ధావన్, ఓ భారత మహిళా సీనియర్ క్రికెటర్‌ను పెళ్లాడబోతున్నాడని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.
35+ ఏళ్ల వయసులోనూ క్రికెట్‌లో కొనసాగుతున్న సదరు మహిళా క్రికెటర్, పెళ్లి విషయంలో ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు...
శిఖర్ ధావన్‌కీ, సదరు మహిళా క్రికెటర్‌కీ మంచి సాన్నిహిత్యం ఏర్పడిందని... అయేషాతో వివాహ బంధంలో అలజడి రావడానికి ఇదే కారణమంటూ కూడా కొందరు యూట్యూబ్ వీడియోలు రూపొందించారు...
అయితే ఆ మహిళా క్రికెటర్, పెళ్లి గురించి చాలా ఏళ్ల క్రితం ఆలోచన ఉండేదని, అయితే పెళ్లైన వాళ్లని చూసిన తర్వాత సింగిల్‌గా ఉండడమే చాలా సౌఖ్యంగా ఫీల్ అవుతున్నానంటూ కామెంట్ చేసింది...
ఈ ఇద్దరి మధ్య పెళ్లి కేవలం వ్యూస్ కోసం కల్పించిన పుకారు మాత్రమేనా, లేదా ఎన్నడూ లేనట్టుగా భారత క్రికెట్‌లో తొలిసారి మహిళా క్రికెటర్‌ను, పురుష క్రికెటర్ పెళ్లాడబోతున్నాడా? అనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే...